ట్రంప్ ముసుగులో దొంగతనం!

అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికై నప్పటి నుంచి కూడా ఆయనకు పెరుగుతున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.ప్రతి రోజు కూడా సోషల్ మీడియా లో ట్రంప్ పై నెటిజన్లు కామెంట్స్ పెడుతూనే ఉంటారు.

 Theft In Trump Mask-TeluguStop.com

ఈ క్రమంలో ఆయనకు ఫ్యాన్స్ కూడా పెరిగిపోయారు అని చెప్పాలి.ఎందుకంటే ఆయన తీసుకొనే దాదాపు అన్ని నిర్ణయాలు కూడా సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ నెటిజన్ల నుంచి కామెంట్స్ పొందుతూ ఉంటారు.

అయితే ఇప్పుడు ఈ కధ అంతా ఏంటి అని అనుకుంటున్నారా.ఆస్ట్రేలియా లో ఒక దొంగ చోరీ కి పాల్పడ్డాడు.

అయితే ఈ చోరీ సమయంలో ఆ దొంగ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాస్క్ వేసుకున్నాడట.సీసీ కెమెరాల్లో అతని ముఖాన్ని గుర్తు పట్టకూడదు అన్న ఉద్దేశ్యంతో ఆ దొంగ ఈ చర్యకు పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు.

ఒక షాపులో దర్జాగా ప్రవేశించి తన పని తాను చేసుకొని పోయాడు.ఆదివారం రోజున ఈ ఘటన చోటుచేసుకుంది.ట్రంప్ వేషధారణ తో షాపు వద్దకు వచ్చిన ఆ వ్యక్తి షాపు అద్దాలను పగుల గొట్టి లోపాలు ఉన్న వచ్చే లను ఎత్తుకొని వెళ్ళిపోయాడు.ట్రంప్ మాస్క్ తో పాటు బ్లాక్ నైట్ జంపర్,బ్లాక్ ట్రాక్ ప్యాంట్,వైట్ షూ ధరించినట్లు తెలుస్తుంది.

అయితే అంతా బాగానే ఉంది కానీ అసలు ఇంతకీ ఆ దొంగ ఎవరు అన్న విషయం కనిపెట్టడం పెద్ద తలనొప్పిగా మారింది అధికారులకు.అతడిని ఎవరైనా గుర్తు పడితే తమకు సమాచారమివ్వాలని ఆస్ట్రేలియా పోలీసులు కోరుతున్నారు.

సీసీటీవీల్లో రికార్డైన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube