Train Oil : కదులుతున్న రైలు నుంచి దొంగతనం..ఆయిల్ కోసం అష్టకష్టాలు

సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ఎక్కడ ఏం జరిగినా ఇట్టే వైరల్ అయిపోతోంది.నెట్టింట కొన్ని మంచి వీడియోలు వైరల్ అవుతుంటే మరికొన్ని మాత్రం కొందరికి భయాన్ని కలిగించేవిగా ఉన్నాయి.

 Theft From A Moving Train Trouble For Oil Oil, Theif, Viral Latest, News Viral,-TeluguStop.com

తాజాగా కొందరు వ్యక్తులు దొంగతనం చేసిన వీడియో నెట్టింట ప్రత్యక్షం అయ్యింది.గతంలో అయితే రైలు నుంచి వస్తువులను, లేకుంటే రైలులో ప్రయాణించేవారి నుంచి నగదును దొంగలు దోచుకునేవారు.

తాజాగా రైలు నుంచి చమురును దొంగలు దోచుకుంటున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.గతంలో రైల్వే బ్రిడ్జిని దొంగిలించిన వీడియో నెట్టింట హల్ చల్ చేసింది.

అంతకు ముందు ఇనుప కడ్డీలతో వేసిన రోడ్డును సైతం దొంగలు దోచుకెళ్లారు.తాజాగా కదులుతున్న రైలు నుంచి దొంగలు ఆయిల్ ను దోచుకున్న వీడియో నెట్టింట సందడి చేస్తోంది.

బీహార్ రాష్ట్రంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతుంటాయి.అందులోనూ రైలు ప్రయాణాలలో జరిగే దొంగతనాల సంఖ్య ఎక్కువగా ఉంది.కొందరు కదులుతున్న ట్రైన్ నుంచి ఆయిల్ ను దొంగతనం చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.సదరు దొంగలు ఆయిల్ ట్యాంకర్ ను లక్ష్యంగా చేసుకుని బకెట్లతో చమురును దోచుకున్నారు.

అది కూడా క
దులుతున్న రైలు నుంచి వారు ఆ పని చేశారు.హిందుస్థాన్ పెట్రోలియం రవాణా చేసుకునే ఆయిల్ ట్యాంకర్ల వద్ద ఆ వ్యక్తులు బకెట్లతో నిల్చున్నారు.

రైలు కదులుతుండగానే ట్యాంకర్ల నుంచి బకెట్లలోకి చమురును దోచుకున్నారు.వారు ఆ తతంగం చేస్తున్నంత సేపు అక్కడున్న ఓ వ్యక్తి వారిని వీడియో తీశాడు.ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ అవుతోంది.ఈ వీడియోను చూసిన నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.వారి బతుకుదెరువు కోసం చాలా కష్టపడుతున్నారని కొందరు అంటుంటూ మరికొందరేమో ఇది చాలా తప్పు, దీనిని పోలీసులు అడ్డుకోలేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube