సీబీఐ మాజీ జేడీ ఇంట్లో దొంగతనం ! చేసింది ఎవరంటే ..?     2018-10-13   13:00:24  IST  Sai Mallula

సిబిఐ మాజీ జెడి లక్ష్మి నారాయణ ఇంట్లో భారీ చోరీ జరిగింది. వారి కుటుంబసభ్యులు పోలీసులకు పిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం చోరీకి పాల్పడింది ఇంట్లోని వ్యక్తి అనే నిర్ధారణకు వచ్చారు. దీనితో అందరిని ప్రశ్నించినా ఎటువంటి సాక్ష్యం లభించకపోవటంతో వెనుదిరిగారు. కానీ ఇంటిలోవారిపై నిఘా పెట్టారు. చివరికి తాజాగా నిఘాలో దొంగను కనిపెట్టారు. పోయిన సొత్తును రికవరి చేశారు.

Theft At Cbi Jd Lakshminarayana Home! Who Did That-

Theft At Cbi Jd Lakshminarayana Home! Who Did That

వివరాలలోకి వెళితే ఏడాది క్రితం లక్ష్మీనారాయణ ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళివచ్చారు. ఇంటికి వచ్చాక గమనించగా లాకర్లు బద్దలు కొట్టి ఉన్నట్టు తెలిసింది. దొంగతనం జరిగినట్టు అనుమానించిన వారు పోలీసులకు పిర్యాదు చేశారు. ఇంటిని అంతా పరిశీలించినా ఒక్క సాక్ష్యం కూడా దొరకలేదు. అయినా ఇంటిలో పనిచేసేవారిపై అనుమానంతో నిఘా పెట్టగా, ఈ దారుణానికి పాల్పడింది డ్రైవర్ అని తేలింది. అతడిని విచారించి దొంగతనం జరిగిన సొమ్మును రికవరి చేశారు అధికారులు.