బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ.. రూ.20 లక్షల !

ప్రముఖ దేవాలయాలో ఒకటైన బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దొంగతనం జరిగింది.ఉత్సవాల్లో కనకదుర్గమ్మను మోసుకెళ్లే వెండి రథంలోని నాలుగు సింహపు ప్రతిమల్లో మూడు చోరీకి గురయ్యాయని ఆలయ నిర్వహకులు వెల్లడించారు.

 Vijayawada, Durgamma, Temple, Theft-TeluguStop.com

ఈ మేరకు ఆలయ అధికారులు బెజవాడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ప్రముఖ దేవాలయం కనకదుర్గమ్మ ఆలయంలో చోరీకి పాల్పడంపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆలయ భద్రత సిబ్బందిపై మండిపడింది.విచారణ జరిపేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించింది.

ఈ మేరకు బెజవాడ సీపీ వెండి సింహాల ప్రతిమల చోరీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు విచారణ చేపట్టారు.సీపీ మాట్లాడుతూ.‘‘ చోరీకి గురైన మూడు సింహపు వెండి ప్రతిమల విలువ రూ.20 లక్షలు ఉంటుంది.ఒక్కో సింహపు ప్రతిమ 3.365 కిలో గ్రాములతో తయారు చేశారని ఆలయ అధికారులు తెలిపారు.ఏడాది నుంచి రథం బయటకు తీయలేదని, ఆలయంలో ఉన్నట్లు ఆలయ సిబ్బంది పేర్కొన్నారు.ఈ చోరీ 2019 ఏప్రిల్ 6 నుంచి ఈ నెల 15 మధ్యకాలంలో జరిగి ఉందవచ్చని అధికారులు ఫిర్యాదులో తెలిపారు.

దొంగతనానికి సంబంధించి అన్ని కోణాల్లో విచారణ జరుపుతాం, త్వరలో ఆలయంలో చోరీకి పాల్పడిన వాళ్లను పట్టుకుంటాం.’’ అని ఆయన పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube