శాశ్వత నివాసం కావాలంటే ‘పరీక్ష’ పాసవ్వాల్సిందే: కెనడా ప్రావిన్స్ కొత్త రూల్

ఇమ్మిగ్రేషన్ విధానంలో కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్ సరికొత్త నిబంధనలు తీసుకొచ్చింది.దేశంలోని అతిపెద్ద ప్రావిన్స్‌గా గుర్తింపు పొందిన క్యూబెక్‌లో శాశ్వత నివాసం కోరుకుంటున్న వలసదారులు కొత్త సెక్యులరిజమ్ చట్టం ప్రకారం ‘‘విలువల పరీక్ష’’ లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

 Thecanadian Quebec Provinceto Introduce Values Test-TeluguStop.com

ప్రధానంగా ఫ్రెంచ్ మాట్లాడే ప్రావిన్స్‌లకు వలసలను తగ్గించేందుకు ఈ విధానాన్ని అమలు పరచాలని క్యూబెక్ ప్రావిన్స్‌ యోచిస్తోంది.

ఇమ్మిగ్రేషన్ విధానాలను సొంతంగా నిర్ణయించేందుకు, దేశంలో తన ప్రత్యేక గుర్తింపును కాపాడుకోవడానికి క్యూబెక్‌కు కెనడా ప్రభుత్వం అనుమతించింది.

కెనడియన్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు కెనడా యొక్క చరిత్ర మరియు చట్టాలతో పాటు ఇతర అంశాలలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని క్యూబెక్ ప్రావిన్స్ అధినేత లెగాల్ట్ తెలిపారు.ప్రజాస్వామ్య విలువలు, క్యూబెక్ మానవహక్కులు మరియు స్వేచ్ఛల చార్టర్ ద్వారా చెప్పిన అంశాల్లో దరఖాస్తుదారుడు కనీసం 75 శాతం మార్కులు సాధిస్తేనే ఉత్తీర్ణత సాధించినట్లని ప్రభుత్వం తన నోటిఫికేషన్‌లో తెలియజేసింది.

Telugu Canadianquebec, Telugu Nri Ups-

ఈ పరీక్ష ఆర్ధిక వలసదారులు వారి కుటుంబసభ్యులకు మాత్రమేనని.శరణార్ధులకు అనుమతి లేదని ప్రభుత్వం వెల్లడించింది.ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న కార్మికుల కొరతను తీర్చడానికి ఆగస్టులో ఈ ప్రావిన్స్‌కు సుమారు 60,000 మంది వలసదారులు అవసరమవుతారని గణాంకాలు చెబుతున్నాయి.ఈ క్రమంలో లెగాల్ట్ ప్రభుత్వం 2019లో 40 వేలుగా ఉన్న వలసదారుల పరిమితిని 2020 నాటికి 43 వేలు లేదా 44,500కు పెంచిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube