థియేటర్ల పునః ప్రారంభం పై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నిర్ణయం ఏంటీ?

కరోనా సెకండ్ వేవ్‌ నేపథ్యం లో మహారాష్ట్రాలో దాదాపుగా మూడు నెలల పాటు థియేటర్లు పూర్తిగా క్లోజ్ అయ్యాయి.ఎట్టకేలకు థియేటర్లు అక్కడ పునః ప్రారంభం అయ్యాయి.50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు పునః ప్రారంభం కు ప్రభుత్వం ఓకే చెప్పడంతో అక్కడ కొన్ని సినిమాలు విడుదల అవుతున్నాయి.ఇదే సమయంలో తెలుగు సినిమాలు ఎప్పుడు వస్తాయా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 Theaters Open In Telugu States-TeluguStop.com

భారీ అంచనాల నడుమ విడుదల అవ్వాల్సిన సినిమాలు కొన్ని విడుదల ముందు నిలిచి పోయాయి.అందులో అఖండ నుండి ఆచార్య వరకు చాలా సినిమాలు ఉన్నాయి.బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలున్న సినిమాలు సందడి చేసేందుకు సిద్దం గా ఉన్నాయి.కనుక ఈ సమయంలో థియేటర్లు పునః ప్రారంభం కోసం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు వెయిట్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సాదారణ కర్ఫ్యూ కొనసాగుతోంది.రాత్రి సమయంలో మాత్రమే ఈ కర్ఫ్యూ వాతావరణం ఉంది.

 Theaters Open In Telugu States-థియేటర్ల పునః ప్రారంభం పై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నిర్ణయం ఏంటీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వచ్చే నెలతో అది కూడా పూర్తిగా ఎత్తి వేసే అవకాశం ఉంది.కనుక జులై లో సినిమా థియేటర్లను ఓపెన్‌ చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు.

కాని థియేటర్ల యాజమాన్యల కు అనుమతులు మాత్రం వచ్చే నెల చివరి వరకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.అంటే జులై లో రావాల్సిన పెద్ద సినిమాలు కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

పెద్ద ఎత్తున సినిమా లు బ్యాక్ టు బ్యాక్‌ ఉన్నాయి.కాని థియేటర్లు ఓపెన్‌ అయ్యే పరిస్థితి ఎప్పుడు అనేది క్లారిటీ లేక పోవడంతో ఆగస్టు మరియు సెప్టెంబర్‌ వరకు సినిమాలు వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు.

ఈ సమయంలో తెలుగు సినిమా ప్రముఖులు అంతా కూడా ఎప్పుడు థియేటర్లు ఓపెన్‌ అవుతాయి అసలు ప్రభుత్వాలు ఈ విషయమై ఏం నిర్ణయం తీసుకుంటారు అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

#Akhanda #Telangana Govt #TeluguFilm #Acharya #Curfew

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు