టికెట్ల రేట్లు పెరుగనున్నాయా?

ఏడు నెలల తర్వాత థియేటర్లలో బొమ్మ పడబోతుంది.ఇండియా మొత్తం ఈ నెల 15వ తారీకు నుండి థియేటర్లకు తాళం తీయబోతున్నారు.బొమ్మ వేసేందుకు అంతా రెడీ అవుతున్నారు.50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను ఓపెన్‌ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం గైడ్‌ లైన్స్‌ ను విడుదల చేసింది.అంతా బాగానే ఉంది కాని ఇప్పుడు థియేటర్లకు జనాలు వస్తారా రారా అనేది చర్చనీయాంశంగా ఉంది.మల్టీప్లెక్స్‌ లకు ఒక మోస్తరుగా జనాలు వచ్చినా సింగిల్‌ స్క్రీన్ ‌ థియేటర్లకు మాత్రం ప్రేక్షకులు రావడం అనుమానమే అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 Theaters Going To Hike Ticket Prices, Ticket Prices, Theaters, Sanitization, Mul-TeluguStop.com

మల్టీప్లెక్స్‌ లో శానిటైజేషన్‌ పక్రిక బాగానే చేస్తారు కాని థియేటర్లలో మాత్రం శానిటైజేషన్‌ ఏ స్థాయిలో చేస్తారు అనేది అనుమానమే.అందుకే అక్కడకు వెళ్లేందుకు ఇప్పటి నుండే ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదు.
ఇక థియేటర్లకు ఈమద్య కాలంలో బాగా మెయింటెన్స్‌ పెరిగి పోయింది.కనుక సగం మంది ప్రేక్షకులు వస్తే మెయింటెనెన్స్‌ ఖర్చులు అయినా వస్తాయా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇప్పటికే నష్టాల్లో ఉన్న థియేటర్ల యాజమాన్యాలు టికెట్ల రేట్లు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.కాని ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు టికెట్ల రేట్లు పెంచేందుకు అనుమతిస్తే అది ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకతకు దారి తీస్తుంది.

కనుక థియేటర్లకు టికట్ల రేట్లు పెంచేందుకు అధికారికంగా ఓకే చెప్పే అవకాశం లేదు.కాని అనధికారికంగా మాత్రం థియేటర్లు రేట్లు పెంచే అవకాశం ఉందని అంటున్నారు.

ఇప్పటికే థియేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలు చాలవన్నట్లుగా కొత్తగా కరోనా వచ్చింది.దాంతో వాటి మనుగడే కష్టంగా మారింది.అక్టోబర్‌ 15న ఎన్ని థియేటర్లు ఓపెన్‌ అవుతాయో చెప్పలేని పరిస్థితి.ఒక వేళ ఓపెన్‌ అయినా కూడా మొత్తం షో లు అంటే రోజుకు నాలుగు షోలు వేయడం అనుమానమే అంటున్నారు.

రెండు లేదా మూడు షోలు వేసి మమా అనిపించే అవకాశం ఉంది అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube