కొడుకు దురుసు ప్రవర్తనకి తల్లి ఇచ్చిన విరుగుడు ఏమిటో తెలుసా..!!!

తల్లి కొడుకుతో పాటు స్కూల్ కి వెళ్ళడం ఏమిటి,బహుశా చదువుకోవడానికి అయ్యి ఉంటుంది అనుకుంటున్నారా అలాంటిది ఏమి కాదు.తన కొడుకు స్కూల్ లో ప్రవర్తన కారణంగా ఆ తల్లి స్కూలు మెట్లు మళ్ళీ ఎక్కాల్సి వచ్చిందట.

 Theamericanreal Motherteaches Alessonforherson-TeluguStop.com

ఇంతకీ ఆమె కొడుకు గారు చేసిన ఆ దురుసు ప్రవర్తన ఏమిటి, తల్లి స్కూలు కి వెళ్లి ఏమి చేస్తోంది.అనే వివరాలలోకి వెళ్తే.

అమెరికాలోని ఒహియో నగరంలోని కెంట్ కి చెందిన బెక్కి అనే మహిళకి ఐదుగురు పిల్లలు ఉన్నారు.వారిలో అందరికంటే పెద్ద కొడుకు స్థానికంగా ఉన్న స్కూల్ లో చదువుకుంటున్నాడు.

ఈ క్రమంలోనే వరుసగా కొన్ని రోజుల నుంచీ ఫోన్ల మీద ఫోన్లు తల్లి బెక్కి కి వస్తున్నాయి.మీ అబ్బాయి ఇక్కడ పిల్లలతో, టీచర్స్ తో దురుసుగా ప్రవర్తిస్తున్నాడు.

ఇది మంచి పద్దతి కాదు ఇలా అయితే స్కూల్ నుంచీ పంపెస్తాం అని హెచ్చరించారు.

Telugu Lesson Son, Mother, Telugu Nri Ups, Telugu Ups-

  ఇలా వరుసగా రెండు రోజులు ఫోన్లు రావడంతో పాటు గతంలో కూడా స్కూలు నుంచీ ఇలాంటి ఫిర్యాదులే రావడంతో ఆ తల్లి కొడుకుని తీసుకుని స్కూలుకి వెళ్ళింది.అంతేకాదు ప్రిసిపాల్ అనుమతి తీసుకుని అతడి క్లాస్ రూమ్ కి వెళ్లి అతడు కూర్చునే పక్కనే కూర్చుంది.అంతేకాదు ఇక నుంచీ తన కొడుకు మారే వరకూ ఇలానే నేను స్కూలు కి వస్తానని తెలిపింది.

దాంతో కొడుకు కష్టం అంతా ఇంతా కాదు.తెగ ఇబ్బంది పడుతున్న కొడుకు తో సెల్ఫి దిగిన ఆమె సోషల్ మీడియాలో ఈ తతంగం అంతా పోస్ట్ చేసింది.

అది కాస్తా వైరల్ అవడంతో సూపర్ తల్లిగా అందరూ ఆమెని పొగడ్తలలో ముంచెత్తుతున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube