కొడుకు దురుసు ప్రవర్తనకి తల్లి ఇచ్చిన విరుగుడు ఏమిటో తెలుసా..!!!  

The Real Mother Teaches A Lesson For Her Son-nri,real Mother,telugu Nri News Updates,telugu Viral News Updates,viral In Social Media

తల్లి కొడుకుతో పాటు స్కూల్ కి వెళ్ళడం ఏమిటి,బహుశా చదువుకోవడానికి అయ్యి ఉంటుంది అనుకుంటున్నారా అలాంటిది ఏమి కాదు.తన కొడుకు స్కూల్ లో ప్రవర్తన కారణంగా ఆ తల్లి స్కూలు మెట్లు మళ్ళీ ఎక్కాల్సి వచ్చిందట.

The Real Mother Teaches A Lesson For Her Son-nri,real Mother,telugu Nri News Updates,telugu Viral News Updates,viral In Social Media-The Real Mother Teaches A Lesson For Her Son-Nri Real Telugu Nri News Updates Viral In Social Media

ఇంతకీ ఆమె కొడుకు గారు చేసిన ఆ దురుసు ప్రవర్తన ఏమిటి, తల్లి స్కూలు కి వెళ్లి ఏమి చేస్తోంది.అనే వివరాలలోకి వెళ్తే.

The Real Mother Teaches A Lesson For Her Son-nri,real Mother,telugu Nri News Updates,telugu Viral News Updates,viral In Social Media-The Real Mother Teaches A Lesson For Her Son-Nri Real Telugu Nri News Updates Viral In Social Media

అమెరికాలోని ఒహియో నగరంలోని కెంట్ కి చెందిన బెక్కి అనే మహిళకి ఐదుగురు పిల్లలు ఉన్నారు.

వారిలో అందరికంటే పెద్ద కొడుకు స్థానికంగా ఉన్న స్కూల్ లో చదువుకుంటున్నాడు.ఈ క్రమంలోనే వరుసగా కొన్ని రోజుల నుంచీ ఫోన్ల మీద ఫోన్లు తల్లి బెక్కి కి వస్తున్నాయి.మీ అబ్బాయి ఇక్కడ పిల్లలతో, టీచర్స్ తో దురుసుగా ప్రవర్తిస్తున్నాడు.ఇది మంచి పద్దతి కాదు ఇలా అయితే స్కూల్ నుంచీ పంపెస్తాం అని హెచ్చరించారు.

ఇలా వరుసగా రెండు రోజులు ఫోన్లు రావడంతో పాటు గతంలో కూడా స్కూలు నుంచీ ఇలాంటి ఫిర్యాదులే రావడంతో ఆ తల్లి కొడుకుని తీసుకుని స్కూలుకి వెళ్ళింది.అంతేకాదు ప్రిసిపాల్ అనుమతి తీసుకుని అతడి క్లాస్ రూమ్ కి వెళ్లి అతడు కూర్చునే పక్కనే కూర్చుంది.అంతేకాదు ఇక నుంచీ తన కొడుకు మారే వరకూ ఇలానే నేను స్కూలు కి వస్తానని తెలిపింది.

దాంతో కొడుకు కష్టం అంతా ఇంతా కాదు.తెగ ఇబ్బంది పడుతున్న కొడుకు తో సెల్ఫి దిగిన ఆమె సోషల్ మీడియాలో ఈ తతంగం అంతా పోస్ట్ చేసింది.అది కాస్తా వైరల్ అవడంతో సూపర్ తల్లిగా అందరూ ఆమెని పొగడ్తలలో ముంచెత్తుతున్నారు.