కోబ్రాను ప‌ట్టుకోవాల‌నుకున్న యువ‌కుడు.. కానీ చిర‌వ‌కు..?

మ‌న‌కు పామును చూస్తేనే భ‌యం వేయ‌డం చాలా కామ‌న్‌.కాగా ఈ పాములు ఎక్కువ‌గా ఈ మ‌ధ్య జ‌నావాసాల్లోకి వ‌స్తున్నాయి.

 The Young Man Who Wanted To Catch Cobra But, Cobra, Viral Video, Viral Animals V-TeluguStop.com

ఇలా వ‌స్తూ చాలామందిని కాటేస్తున్నాయి.ఈ మ‌ధ్య మ‌రీ ఎక్కువ‌గా కింగ్ కోబ్రాలు జ‌నావాసాల్లోకి వ‌స్తున్నాయి.

సాధార‌ణంగా ఈ కింగ్ కోబ్రా పాములు జ‌నావాసాల్లోకి వ‌చ్చేందుకు పెద్ద‌గా ఇంట్రెస్ట్ చూపించ‌వు.కానీ ఇలా వ‌స్తున్నాయంటే దానికి చాలా కార‌ణాలున్నాయి.

అయితే ఈ కోబ్రాల్లోని విషం అత్యంత ప్ర‌మాద‌క‌రం.మ‌న‌కు సాధార‌ణంగా క‌నిపించే పాముల క‌న్నా కూడా ఈ పాముల విషం అత్యంత ప్ర‌మాద‌క‌రం.

ఈ కింగ్ కోబ్రా కు మ‌నం గ‌న‌క చిక్కుకున్నట్లయితే ఇక అంతే సంగ‌తులు.దాని విషం మనిషి బాడీలో అత్యంత వేగంగా వ్యాపించి క్ష‌ణాల్లోనే ప్రాణాలు తీస్తుంది.

కాగా ఇలాంటి పాముల‌ను కూడా ప్రేమించే వారు కొంద‌రు ఉంటారు.జంతు ప్రేమికుల‌కు అది ఎంత ప్ర‌మాద‌క‌ర‌మైనా కూడా ఇలాంటి ప్రాణులకు హాని క‌లిగితే చలించిపోతుంటారు.

అయితే ఇప్పుడు కూడా ఓ వ్య‌క్తి ఇలాగే కింగ్ కోబ్రాపై జాలి ప‌డి దాన్ని కాపాడ‌బోయి చివ‌ర‌కు త‌న ప్రాణాల మీద‌కు తెచ్చుకున్నాడు.ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

ఇక ఇప్పుడు మ‌నం ఇక్క‌డ చూస్తున్న వీడియోలో ఓ కింగ్ కోబ్రా ఓ వ్య‌క్తి ఇంట్లోకి చొరబడింది.ఇంక దాన్ని పట్టుకోవాలని ఓ వ్య‌క్తి విప‌రీతంగా ప్రయత్నిస్తున్న‌ట్టు మ‌న‌కు క‌నిపిస్తుంది.ఇక ఆ వ్య‌క్తి ధైర్యం చేసి ఆ పాము తోకను పట్టుకుని లాగాడు.మ‌రి ఇలా లాగితే ఆ కోబ్రా ఊరుకుంటుందా చెప్పండి.ఇంకేముంది బుసలు కొడుతూ చాలా కోపంతో బయటికి వచ్చి అక్క‌డున్న ఆ వ్య‌క్తిపై దాడి చేసేందుకు ప్ర‌య‌త్నించింది.ఇక దాని మెరుపు దాడి నుంచి ఆ వ్య‌క్తి అల‌ర్ట్ అయిపోయి త‌న ప్రాణాలు కాపాడుకున్నాడు.

ఈ వీడియో ఇప్పుడు అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube