వీడియో: బైకును కారుగా మార్చిన యువకుడు.. బాబోయ్, ఇదేం క్రియేటివిటీ అంటున్న నెటిజన్లు..!

సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచ నలుమూలల దాగున్న టాలెంటు ఎప్పటికప్పుడు తెర మీదకు వస్తోంది.ఇప్పటికే సోషల్ మీడియా ఎన్నో క్రియేటివ్ వీడియోలను పరిచయం చేసి మనల్ని అబ్బురపరిచింది.

 The Young Man Who Turned The Bike Into A Car Baboy This Is What Netizens Say About Creativity-TeluguStop.com

తాజాగా కూడా మరొక క్రియేటివ్ వీడియోతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఈ వీడియోలో ఒక వ్యక్తి తన బైకును కారు గా మార్చి నడపడం చూడొచ్చు.

ఈ యువకుడు తన బైక్ హ్యాండిల్ తీసేసి ఆ స్థానంలో కారు స్టీరింగ్ అమర్చాడు.అంతే కాదు అదే స్టీరింగ్ వినియోగిస్తూ రోడ్డుపై వేగంగా దూసుకుపోతున్నాడు.

 The Young Man Who Turned The Bike Into A Car Baboy This Is What Netizens Say About Creativity-వీడియో: బైకును కారుగా మార్చిన యువకుడు.. బాబోయ్, ఇదేం క్రియేటివిటీ అంటున్న నెటిజన్లు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బహుశా ఇలాంటి ఆలోచన ఇప్పటి వరకూ ఎవరికీ రాలేదేమో.అందుకే నెటిజన్లు కూడా తెగ ముచ్చట పడుతున్నారు.

బాబోయ్, ఇదేం క్రియేటివిటీ! అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వీడియోని పాకిస్తాన్ లో తీసినట్లు సమాచారం.

అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి కారు గా మారిన ఒక ఓల్డ్ బైక్ ను చూసి ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది.అంతేకాదు ఈ అద్భుతమైన దృశ్యాలను తన కెమెరాలో బంధించారు.

అనంతరం నెట్టింట షేర్ చేసి అందర్నీ అవాక్కయ్యేలా చేస్తున్నారు.తమాషా ఏంటంటే.

ఇదే స్టీరింగ్ కి క్లచ్ అమర్చాడు సదరు యువకుడు.

ఎక్స్ లెటర్ ఎక్కడుందో మాత్రం కనిపించలేదు.కానీ ఈ యువకుడు మాత్రం ఎంచక్కా కారు నడిపినట్లు తన బైక్ ను రైడ్ చేస్తూ ఫిదా చేస్తున్నాడు.బైక్ ని ఈ విధంగా కూడా వాడొచ్చని చేసి చూపించిన ఈ యువకుడి పై ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

అయితే ఇలాంటి ప్రయోగాలు చేసే ముందు కాస్త జాగ్రత్త వహించడం శ్రేయస్కరమని మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఈ క్రియేటివ్ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.

#Bike

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు