పెళ్లి కోసం ఓ యువకుడి సాహసం.. ప్రాణాలతో చెలగాటం.. !

ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు చేసుకోవడం, లేదంటే చస్తానని బెదిరించడం యువతకు ఫ్యాషన్ గా మారింది.ఇలాంటి ఆలోచనలు చేసే బదులు బ్రతుకుతో పోరాడితే ఓటమి అయినా తల వంచుతుంది.

 The Young Man Who Climbed The Cell Tower To Get-TeluguStop.com

కనీసం నలుగురిలో గుర్తింపు వస్తుంది.కానీ బ్రతికి సాధించలేనిది చచ్చాక సాధిద్దామనే ఆలోచనలతో యువత మనసులు బలహీనంగా మారడం విషాదకరం.

ఇకపోతే కర్ణాటకలోని హొసపేట తాలూకాలోని మరియమ్మనహళ్లిలో ఓ యువకుడు తాను ప్రేమించిన యువతితో పెళ్లికి సిద్దం అయ్యాడు.ఇరువురి పెద్దలు ఒప్పుకోవడంతో.కానీ కరోనా మహమ్మారి వల్ల వీరి పెళ్లి వాయిదా పడటంతో అలా రోజులు గడిచినా కానీ పెళ్లి ఊసు ఎత్తడం లేదట పెద్దలు.దీంతో విసుగుపుట్టిన ఆ యువకుడు ప్రాణాలతో చెలగాటమాడటానికి సిద్దం అయ్యాడు.

 The Young Man Who Climbed The Cell Tower To Get-పెళ్లి కోసం ఓ యువకుడి సాహసం.. ప్రాణాలతో చెలగాటం.. -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

స్దానికంగా ఉన్న సెల్ టవర్‌ ఎక్కి తనకు త్వరగా పెళ్లి చేయకపోతే కిందకు దూకుతానని, ఆ టవర్‌కు అమర్చబడి ఉండే ఓ పరికరం పైన కూర్చుని అందరినీ హడలెత్తించాడు.దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఈ సాహస గాధలోని ప్రేమ కధకు శుభం కార్డు వేస్తారని నచ్చ చెప్పి అతన్ని కిందకు దిగేలా చేశారు.

అయినా పెళ్లి ఇవాళ్ల కాకపోతే రేపైనా, లేదా సంవత్సరానికైనా చేసుకోవచ్చు కానీ చస్తే ఎలా అనే ఆలోచనే రాకుండా ఇలా ప్రవర్తించడం విషాదం.

#Marriage #Married #Karnataka #Young Man #Hospet

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు