యువతిని కిడ్నాప్ చేసి.. ఎడారిలో తాళి కట్టిన యువకుడు..!

ప్రస్తుత సమాజంలో కొందరు వ్యక్తులు తమకు నచ్చిన పనులు చేస్తూ ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా తమ మాటనే నెగ్గాలి అనే భావంతో దారుణంగా కొట్టడం, తిట్టడం లాంటివి చేస్తున్నారు.

 The Young Man Kidnapped The Young Woman And Clapped His Hands In The Desert , Ki-TeluguStop.com

ఇంకొంతమంది దారుణంగా హత్యలు చేయడానికి అయినా వెనుకాడడం లేదు.నేటి తరంలో ఆత్మహత్యలకంటే హత్యల సంఖ్య చాలా ఎక్కువ.

ఓ యువతి పెళ్లికి నిరాకరించిందని కిడ్నాప్ చేసి ఎడారిలో పెళ్లి చేసుకున్నాడు ఓ యువకుడు.అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు చూద్దాం.

Telugu Clapped, Rajasthan, Kidnapped, Latest Telugu-Latest News - Telugu

వివరాల్లోకెళితే.రాజస్థాన్లోని జైసల్మేర్( Jaisalmer in Rajasthan ) లో నిశ్చితార్థం అయిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఓ సైకో ప్రేమికుడు పుష్పెంద్ర సింగ్( Pushpendra Singh ) (28) ఇబ్బందులకు గురి చేశాడు.ఎంత ప్రయత్నించినా ఆ యువతి పెళ్లికి అంగీకరించలేదు.దీంతో కొందరు వ్యక్తుల సహాయంతో ఆ యువతిని బలవంతంగా కిడ్నాప్ చేసి ఎడారి ప్రాంతానికి తీసుకెళ్లాడు.పుష్పెంద్ర సింగ్ కొంత గడ్డి కోసి నిప్పు పెట్టి ఆ అమ్మాయి చేయి పట్టుకుని మంట చుట్టూ ఏడుసార్లు తిరిగి తమకు పెళ్లి అయిపోయిందని చెప్పాడు.ఇక నువ్వు వేరే వ్యక్తితో పెళ్లి చేసుకోవద్దని బెదిరించాడు.

ఈ ఘటన జూన్ 1వ తేదీన జరిగింది.ఈ సంఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు.

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.యువతి ఇలా చేయొద్దంటూ, తనను కాపాడండి అంటూ కేకలు వేయడం వీడియోలో స్పష్టంగా రికార్డు అయింది.

తర్వాత ఆ అమ్మాయి తన కుటుంబ సభ్యులతో కలిసి మోహన్ గడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

Telugu Clapped, Rajasthan, Kidnapped, Latest Telugu-Latest News - Telugu

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ యువతికి, అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో జూన్ 12వ తేదీ వివాహం జరిపించేందుకు ఈ కుటుంబ పెద్దలు ముహూర్తం పెట్టుకున్నారు.అయితే పుష్పెంద్ర సింగ్ ఆ అమ్మాయిని దక్కించుకోవడం కోసం ఇలా బలవంతంగా కిడ్నాప్ చేసి, ఈ దారుణానికి పాల్పడ్డాడు.పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube