తన హార్ట్‌ మిస్సయిందని పోలీసులకు యువకుడి ఫిర్యాదు.. పోలీసులు ఏం చేశారో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే  

  • ఎవరైనా తమ వస్తువు పోయిందని, లేదంటే తనను ఎవరైనా కొట్టారని పోలీసులకు ఫిర్యాదు ఇస్తారు. పోలీసులకు ఎక్కువగా విలువైన వస్తువులు దొంగతనంకు గురయ్యాయంటూ కేసులు వస్తాయి.

  • The Young Man Complaints About His Heart Missing To Police-Love Failure Story\'s Telugu Viral News The Love Story In Social Media

    The Young Man Complaints About His Heart Missing To Police

  • కాని మేఘాలయ రాష్ట్రంకు చెందిన ఒక వ్యక్తి తన గుండె పోయిందని, తన గుండెను వెదికి పెట్టాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. రాత పూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఏం చేయాలో పాలుపోక ఉన్నతాధికారులకు చెప్పారు. ఉన్నతాధికారులు కూడా ఆ యువకుడి ఫిర్యాదుపై మీటింగ్‌ పెట్టి మరీ చర్చించారు.

  • పూర్తి వివరాల్లోకి వెళ్తే… మేఘాలయ రాష్ట్రం నాగపూర్‌లోని ఒక పోలీస్‌ స్టేషన్‌కు హడావుడిగా ఒక కుర్రాడు చేతిలో ఒక పేపర్‌ పట్టుకుని వచ్చాడు. తన వస్తువు పోయింది, ఒక అమ్మాయి దొంగిలించింది అంటూ ఆ కుర్రాడు పోలీసులకు చెప్పాడు. దొంగతనం అనగానే పోలీసులు అలర్ట్‌ అయ్యారు. ఎవరా దొంగ, ఏం పోయిందా అంటూ అతడు ఇచ్చిన ఫిర్యాదు పేపర్‌ను రైటర్‌ చదివాడు. అది చదివిన కానిస్టేబుల్‌ అవాక్కయ్యాడు. ఆ ఫిర్యాదు పేపర్‌ను అంతా కూడా చదివారు. ఇదేం గొడవరా బాబు నీ హార్ట్‌ పోవడం ఏంటీ, అది మేము వెదికి తేవడం ఏంటీ అంటూ కానిస్టేబుల్స్‌ ఆ కుర్రాడితో అన్నారు. అయితే ఆ కుర్రాడు పట్టుబట్టి తన హార్ట్‌ను తిరిగి నాకు ఇప్పించాలని డిమాండ్‌ చేశాడు.

  • తన హృదయంను ఏ అమ్మాయి అయితే దొంగిలించిందో ఆ అమ్మాయిని పట్టుకోవాలని ఆ అమ్మాయికి సంబంధించిన వివరాలు కూడా ఇచ్చాడు. ఆ యువకుడి ఫిర్యాదుతో పోలీసులు తల పట్టుకున్నారు. ఏం చేయాలో పాలు పోక ఉన్నతాధికారులకు చెప్ప, వారు చర్చించి, ఇలాంటి ఫిర్యాదుల తీసుకోబడవు అంటూ తేల్చి చెప్పారు. భారత చట్టంలో ఇలాంటి కేసులకు పరిష్కారాలు లేవని, ఆమెతో కూర్చుని మాట్లాడుకోవాలంటూ తేల్చి చెప్పారు. దాంతో ఆ కుర్రాడు బిక్కమొహం వేసుకుని పోలీస్‌ స్టేషన్‌ నుండి బయటకు వచ్చాడు. నాగపూర్‌ పోలీస్‌ కమీషనర్‌ భూషన్‌ కుమార్‌ ఉపాధ్యాయ్‌ ఈ కేసు గురించి స్పందిస్తూ ఇలాంటి కేసులను స్వీకరించం అని, ఇలాంటి కేసులను టేకప్‌ చేసేందుకు మాకు అనుమతి లేదంటూ తేల్చి చెప్పాడు. ఒకవేళ అలా కేసు నమోదు చేసుకుంటే ఇక రచ్చ రచ్చగా కేసులు నమోదు అవుతాయి. వేలాది మంది కుర్రాళ్లు తమ హృదయం పోయిందంటూ కేసులు పెడతారు.

  • The Young Man Complaints About His Heart Missing To Police-Love Failure Story\'s Telugu Viral News The Love Story In Social Media