కేంద్ర ఎన్నికల కమిషనర్ నీ కలిసిన వైసీపీ ఎంపీలు..!!

వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి( Vijaysai Reddy ) నేతృత్వంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ తో వైసీపీ ఎంపీలు భేటీ అయ్యారు.

ఈ క్రమంలో ఓట్ల తొలగింపు తెలుగుదేశం దుష్ప్రచారాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.

ఈసీతో భేటీ అనంతరం.ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు( Chandrababu Naidu ) అధికారంలో ఉన్నప్పుడు భారీ స్థాయిలో ఓట్ల అవకతవకలకు పాల్పడి దొంగ ఓట్లతో అధికారాన్ని చేజిక్కించుకున్నారని విమర్శించారు.

ఈ క్రమంలో తాము అవకతవకలకి పాల్పడుతున్నట్లు ఆయన అంటుంటే దొంగే దొంగ అన్న చందాన ఉందని అన్నారు.ఎలక్షన్ కమిషన్ కు చేసిన ఫిర్యాదులో 2014 నుంచి నమోదైన దొంగ ఓట్లపై విచారణ జరిపించాలని కోరినట్లు స్పష్టం చేశారు.2014-19 వరకు చంద్రబాబు పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్పించారని.ఆ లెక్క సంగతి తేల్చాలని.

Advertisement

స్పష్టం చేశారు.

ఇదే సమయంలో దొంగ ఓట్ల ఏరివేత బాధ్యత పూర్తిగా ఈసీ దేనని పేర్కొన్నారు.వెంటనే ఓటర్ కార్డులను ఆధార్ కార్డుతో లింక్ చేయాలని, ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉండాలని రాబోయే ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకతతో జరిపించాలని.ఈసీని కోరినట్లు స్పష్టం చేశారు.

ఈసారి అత్యంత పారదర్శకతతో ఓట్ల నమోదు కార్యక్రమం జరిగిందని పేర్కొన్నారు.ఏపీలో ఎక్కడ కూడా దొంగ ఓట్ల నమోదు జరగలేదని స్పష్టం చేశారు.

ఎన్నికలకు నిజమైన ఓటర్ల జాబితా ఉండాలన్నదే తమ ఉద్దేశం అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.చంద్రబాబు సేవా మిత్రా ఇంకా మై టీడీపీ ( TDP )ద్వారా బోగస్ ఓట్లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఏంది భయ్యో.. నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా.. అంత క్యాజువల్ గా నడుస్తున్నావ్?

దీనిపై ఈసీ ఫుల్ కమిషన్ ద్వారా విచారణ జరిపిస్తామని.హామీ ఇచ్చినట్లు స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు