ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ( YCP )ఇచ్చే ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.ఈ క్రమంలో ఆ పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్( CM Jagan ) దాదాపు ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందే నేతల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటున్నారు.
ఇదే సమయంలో నేతల సమీక్ష సమావేశాలలో సర్వేలలో వచ్చే ఫలితాలు బట్టి టికెట్ కేటాయింపు ఉంటుందని హెచ్చరించడం జరిగింది.ఇదిలా ఉంటే రెండోసారి కూడా తామే అధికారంలోకి వస్తామని వైసీపీ మంత్రి కొట్టు సత్యనారాయణ( YCP Minister Kottu Satyanarayana ) వ్యాఖ్యానించారు.
ఎవరెన్ని ఆరోపణలు చేసిన 2024లో కూడా గెలిచేది వైసీపీయే అని స్పష్టం చేయడం జరిగింది.అంతేకాదు సీఎం జగన్ చరిత్ర సృష్టిస్తారని కూడా ధీమా వ్యక్తం చేశారు.అదేవిధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వైసీపీ పై చేస్తున్న వ్యాఖ్యల వెనుక ఎవరున్నారో కూడా తమకు తెలుసని అన్నారు.రెండోసారి అధికారంలోకి రాగానే సీఎం జగన్ వారి అకౌంటులను సెటిల్ చేస్తారని స్పష్టం చేశారు.
మరోవైపు రాష్ట్రంలో అర్చకులకు ఉద్యోగ విరమణ లేకుండా ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్లు పేర్కొన్నారు.దీనిపై కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు.