పార్టీ వ్యతిరేకులతో నాయకుల చట్టాపట్టాలు.. వైసీపీలో కలకలం..

ఇటీవలే విజయవాడలో కొన్ని ఘటనలు జరిగాయి.అవి వైసీపీ పార్టీలో కొంత కలవరాన్ని సృష్టించడంతో పాటు కలకలం రేపుతున్నాయి.

 Ycp Leaders Party With Opponents Details, Ycp Leaders, Party With Opponents, Ap-TeluguStop.com

వైసీపీ నేతలు కొందరు చేస్తున్న పనులు వల్ల పార్టీకి ఇబ్బందులు తప్పవంటున్నారు కొందరు నాయకులు.ప్రత్యర్థి పార్టీ గెలుపుకోసం కృషి చేసిన ఓ నాయకుడితో వైసీపీ నేతలు చెట్టాపట్టాలేసుకుని తిరగడాన్ని కొందరు తప్పుపడుతున్నారు.

కానీ వైసీపీలో కొందరు నాయకులు మాత్రం ఇందుకు భిన్నంగా స్పందిస్తున్నారు.ఇతర పార్టీ నేతలను కలిసినంత మాత్రానా పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని, ఆ నేతకు ఇతర పార్టీల్లోనూ సంబంధాలు ఉన్నాయని సమర్థిస్తున్నారు.

వీరందరూ ఇలా భిన్నంగా కామెంట్స్ చేసినా వాస్తవానికి మాత్రం వైసీపీ కేడర్ కాస్త దెబ్బతినేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

పోయిన ఎలక్షన్స్‌లో విజయవాడ కు చెందిన ఓ నేత ఆయనకు టికెట్ ఇవ్వలేదని వైసీపీ నుంచి మరో పార్టీలోకి మారాడు.

ఎన్నికల టైంలో ఇవన్నీ సహజమే.ఇక ఆయన వైసీపీకి వ్యతిరేకంగా జరిగిన ధర్నాలో పాల్గొనడం.

అమరావతి రాజధానిగా ఉండాలని డిమాండ్ చేయడం వంటివి చేశారు.అలాంటి నేతలలో వైసీపీకి చెందిన కొందరు నాయకులు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది.

దీనిపై సోషల్ మీడియాలో సైతం పలువురు ప్రశ్నలు కురిపిస్తున్నారు.అంతే కాదు సదురు నేత ఇంట్లో జరిగిన కార్యక్రమానికి సైతం హాజరయ్యారు.

Telugu Amaravathi, Apcm, Ap, Oppositon, Vijayawada, Vijayawada Ycp, Ycp Cadre, Y

ఆయన వైసీపీ అధినేతపై నోరు పారేసుకున్న విషయాన్ని సైతం మర్చిపోయి వైసీపీ నేతలు ఆయనతో కలిసి తిరుగుతున్నారా అంటూ పార్టీలోని వాళ్ళను కొందరు ప్రశ్నిస్తున్నారు.ఇలాంటి వారు కేవలం పార్టీ కోసం పనిచేయకుండా పదవుల కోసం మాత్రం పార్టీలు మారతారని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.వైసీపీ పార్టీలో సైతం ఈ విషయంపై బహిరంగంగానే చర్చలు నడుస్తున్నట్టు తెలుస్తోంది.సీఎం జగన్ కు అన్నీ తెలుసని, టైం వచ్చినప్పుడు వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు వైసీపీలోని కొందరు నేతలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube