కొంపముంచిన వైసీపీ కార్యకర్తల అత్యుత్సాహం.. ఆటాడుకుంటున్న తెలుగు తమ్ముళ్లు..!

ప్రజెంట్ పాలిటిక్స్ ఒకప్పటిలా ఉండటం లేదు.ప్రతీ విషయం ఆన్‌లైన్‌లోనే క్షణాల్లోనే తెలిసిపోతున్నది.

 Ycp Activists Shared Fake Photo Of House Scheme Tdp Leaders Trolling, Ycp, Tdp,-TeluguStop.com

ఒకప్పటిలా ఇంటింటి ప్రచారం, సభలు, సమావేశాలు వంటి వాటికి రాజకీయ పార్టీలు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి.ప్రతీ పొలిటికల్ పార్టీ సోషల్ మీడియాలో తమ సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది.

ఈ క్రమంలోనే పార్టీ చేయబోయే, చేస్తున్న అభివృద్ధి పనులను ప్రచారం చేస్తున్నాయి.తాజాగా ఏపీ పొలిటికల్ ఫైట్ రెండు పార్టీల మధ్య సోషల్ మీడియా వేదికగా జరిగింది.

అధికారా వైసీపీ పోస్టుపై ప్రతిపక్ష టీడీపీ పార్టీ సంభాషణలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేసిన పనులను వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు.తాజాగా వైసీపీ కార్యకర్త ఒకరు జగనన్న ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లు వరుసగా పూర్తయ్యాయని, లబ్ధిదారులు గృహ ప్రవేశం జరుగుతున్నా రెండో కంటికి అసలు తెలియడం లేదని పేర్కొంటూ ట్విట్టర్ వేదికా ఓ ఫొటోను జత చేసి పోస్టు పెట్టాడు.

ఇక్కడే అసలు ట్విస్టు ఉంది.వైసీపీ కార్యకర్త జత చేసిన ఫొటోను చూసి టీడీపీ తెలుగు తమ్ముళ్లు వెంటనే కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు.

Telugu Ap, Jaganhouses, Kerala, Tdp, Ycp-Telugu Political News

వైసీపీ కార్యకర్త నెట్టింట షేర్ చేసిన ఫొటో ఫేక్ అని పేర్కొంటూ ప్రచారం మొదలు పెట్టారు.ఎక్కడో కేరళ స్టేట్‌లో కట్టిన ఇంటిని తీసుకొచ్చి ఏపీలో జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్మిస్తోందని తెలుపుతున్నారని ట్వీట్స్ చేయడం ప్రారంభించగా, వాటిని చూసి వైసీపీ కార్యకర్త ట్వీట్‌ను డిలీట్ చేశారు.అయితే, అప్పటికే టీడీపీ తమ్ముళ్లు వైసీపీ కార్యకర్త ట్వీట్‌ను స్క్రీన్ షాట్ తీసుకున్నారు.దానిని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.ఇలా రెండు పార్టీల కార్యకర్తల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తున్నది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube