ప్రపంచంలోనే అతిపెద్ద పిజ్జా.. దీని తయారీకి 6 వేల కిలోల పిండి వాడారు!!

ప్రముఖ పిజ్జా రెస్టారెంట్ పిజ్జా హట్ తయారుచేసిన అతిపెద్ద పిజ్జా తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరింది.న్యూయార్క్ స్టైల్ పిజ్జాగా పిలిచే దీన్ని సుమారు 6192.89 కిలోల పిండి, 2244.37 కిలోల మారినారా సాస్, 3991.61 కిలోల జున్ను, 6,30,496 పెప్పరోనీ ముక్కలతో తయారు చేశారు.ఈ పిజ్జా పొడవు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13,990 చదరపు అడుగులు.

 The World's Largest Pizza 6 Thousand Kg Of Flour Was Used To Make It , Largest P-TeluguStop.com

అంటే అది ఎంత పెద్దగా ఉందో అర్థం చేసుకోవచ్చు.జనవరి 20, 2023న ఈ ఆకట్టుకునే ఫీట్‌ను Pizza Hut సాధించి సోషల్ మీడియాలో ఒక అప్‌డేట్‌ను కూడా షేర్ చేసింది.

ఈ పిజ్జాను తయారు చేయడానికి కంపెనీ యూట్యూబ్ స్టార్ ఎరిక్ డెక్కర్‌తో జతకట్టింది.

13,990 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న పిజ్జాను పూర్తి చేసే పని లాస్ ఏంజిల్స్ కన్వెన్షన్ సెంటర్‌లో జనవరిలో ప్రారంభమైంది.ఇలాంటి పిజ్జా ఇంతవరకు ప్రపంచంలో ఎవరూ తయారు చేయలేదు కాబట్టి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వీరికి తమ బుక్‌లో చోటు కల్పించింది.కొత్త రికార్డ్ లార్జెస్ట్ పిజ్జా 13,990 చదరపు అడుగులు అని పేర్కొంటూ ఎరిక్ డెక్కర్‌, పిజ్జా హట్‌కి అభినందనలు తెలిపింది.

యూట్యూబ్‌లో 10 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లను ఎయిర్‌రాక్ లేదా ఎరిక్ డెక్కర్‌ తాజాగా సంపాదించాడు.ఈ శుభ సందర్భంలో అతడు ఇంత పెద్ద పిజ్జా తయారు చేయడానికి హెల్ప్ చేశాడు.

ఈ రికార్డు నమోదైన తరువాత, ఆ పిజ్జా లాస్ ఏంజిల్స్‌లోని అనేక స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందించడం జరిగింది.2012లో ఇటలీలోని రోమ్‌లో NIPfood కంపెనీ 13,580.28 చదరపు అడుగులతో పిజ్జా తయారు చేసింది.ఆ రికార్డును తాజాగా పిజ్జా హట్ బ్రేక్ చేసింది.

అయితే తాజాగా సృష్టించిన అతిపెద్ద పిజ్జాను చూసి చాలామంది అవాక్కవుతున్నారు.పిజ్జా తయారు చేశారు కానీ ఇంత పెద్ద డైట్ కోక్‌ చేయలేదని ఒకరు ఫన్నీగా కామెంట్ చేశారు.

ఇందులో ఒక్క అడుగు కూడా తాము తినలేమని మరికొందరు కామెంట్స్ చేశారు.ఇంత పెద్ద దాన్ని ఎలా కుక్ చేశారో ఏమో అని ఇంకొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube