రానున్న కాలంలో ప్ర‌పంచం అంతం అవుతుందంట‌.. టైం ట్రావెల‌ర్ సంచ‌ల‌న విష‌యాలు..!

ఈ ప్రపంచం త్వరలో అంతమయి పోనుందని ఇప్పటికే చాలా మంది శాస్త్రజ్ఞులతో పాటు సాధారణ వ్యక్తులు కూడా చెప్పి ఉన్నారు.అంతే కాకుండా మన ఇళ్లలో పెద్దవారు కూడా పురాణాలు ప్రపంచం అంతమవుతుందని ముందే చెప్పాయని చెబుతారు.

 The World Will End In The Near Future Time Traveler Sensational Things-TeluguStop.com

కానీ కొంత మంది వారివి ఉత్త మూఢ నమ్మకాలని కొట్టిపారేస్తారు.కానీ సైన్స్ ను అమితంగా ప్రేమించే శాస్త్రవేత్తలు కూడా చాలా సందర్భాల్లో ప్రపంచ అంతం గురించి వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ఎడ్వర్డ్ అనే వ్యక్తి తాను ట్రైం ట్రావెల్ మిషన్ సాయంతో 5000 వ సంవత్సరం వరకూ ముందుకు వెళ్లి చూశానని ప్రపంచం కనిపించలేదని చెప్పడం గమనార్హం.

 The World Will End In The Near Future Time Traveler Sensational Things-రానున్న కాలంలో ప్ర‌పంచం అంతం అవుతుందంట‌.. టైం ట్రావెల‌ర్ సంచ‌ల‌న విష‌యాలు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఓ యూ ట్యూబ్ చానెల్ తో మాట్లాడిన ఎడ్వర్డ్ తాను టైం ట్రావెల్ మిషన్ లో ప్రయాణించానని అది చాలా సీక్రెట్ ఆపరేషన్ అని చెప్పాడు.

ఎప్పుడో 2018 సంవత్సరంలో చేసిన ఆ యూట్యూబ్ వీడియో ఇప్పుడు మరలా వైరల్ అవుతూ.సంచలనంగా మారింది.తాను భవిష్యత్ లోకి ప్రయాణించి చూసినపుడు చాలా షాకింగ్ విషయాలు కనిపించాయని ఎడ్వర్డ్ వివరించారు.అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరం మొత్తం నీటితో మునిగి పోయి ఉందని తెలిపాడు.

తాను 2004 లో ఓ సీక్రెట్ మిషన్ ద్వారా ఇలా టైమ్ ట్రావెల్ గురించి అధ్యయనం చేస్తూ.అందులో భాగస్వామిగా చేరినట్టు ఎడ్వర్డ్ వివరించారు.

తాను భవిష్యత్ లోకి వెళ్లినపుడు తాను ఒక చెక్క ప్లాట్ ఫాం మీద నుంచొని ఉన్నానని చెప్పుకొచ్చాడు.ఇది ఏంటా అని ఆశ్చర్యపోయి చూడగా.

అక్కడ ఉన్న ఇళ్లన్నీ చెక్కతోనే నిర్మితమై ఉన్నాయని అది ప్రఖ్యాత లాస్ ఏంజెల్స్ నగరమని తాను తర్వాత గుర్తించినట్లు వివరించాడు.ఇలా చెప్పడం కేవలం ఎడ్వర్డ్ కు మాత్రమే చెందినది కాదు ఇది వరకే ఓ వ్యక్తి తాను టైం ట్రావెల్ మిషన్ లో ప్రయాణించానని భవిష్యత్ లో మనుషులకు ఏలియన్స్ కు మధ్య యుద్ధం జరుగుతున్నట్లు తాను చూశానని చెప్పాడు.

#Global #LosAngeles #Time Traveller #TheWorld

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు