తాగునీటి కోసం ఈ ఏనుగు చేసిన ప‌ని చూస్తే మెచ్చుకోవాల్సిందే..

ఈ సృష్టిలో తాగునీటికి ఉన్న ప్రాధాన్య‌త ఏంటో అంద‌రికీ తెలిసిందే.కాగా చాలా ప్రాంతాల్లో ఈ తాగునీటికి ఇబ్బందులు ఉండ‌టంతో వారు ఎన్ని ఇబ్బందులు ప‌డుతుంటారో చూస్తూనే ఉన్నాం.

 The Work Done By This Elephant For Drinking Water Is Admirable , Elephant, Viral-TeluguStop.com

కాగా ఈ ఎద్ద‌డి అప్పుడ‌ప్పుడు అడ‌వి జంతువుల‌కు కూడా ఉంటుంది.ఇక నీరు లేని చోట అవి వాటిని తాగేందుకు వంద‌ల కిలోమీట‌ర్లు కూడా ప్ర‌యాణం చేస్తుంటాయి.

ఇక నీటిని తాగేందుకు అప్పుడ‌ప్పుడు జంతువులు చేసే ప‌నులు చూస్తే మ‌న‌కు నిజంగానే ఆశ్చ‌ర్యం వేస్తోంది.ఎందుకంటే అచ్చం మ‌నుషుల్లాగే అవి కూడా చేస్తుంటాయి కాబ‌ట్టి.

కాగా ఇప్పుడు ఓ ఏనుగు కూడా నీటికోసం చేసిన ప‌ని చూస్తే నిజంగా మెచ్చుకోకుండా ఉండ‌లేరేమో.అయితే మామూలుగానే ఏనుగులు ఏ ప‌ని చేసినా ఇట్టే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిపోతుంటాయి.

అవి మ‌న మనసుకి ఆహ్లాదాన్ని క‌లిగిస్తూ ఎంతో సంతోషాన్ని ఇస్తాయి.కాగా ఇప్పుడు మ‌నం చూడ‌బోయే వీడియోలో ఒక ఏనుగు దాహం వేయ‌గా ద‌గ్గ‌ర్లోని ఓ బోరింగ్ పైప్ ద‌గ్గ‌ర‌కు వెళ్లింది.

అయితే ఎక్క‌డా నీరు క‌నిపించ‌క‌పోవ‌డంతో బోరింగ్ కొట్టాల‌ని అనుకుందో ఏమో గానీ అచ్చం మ‌నుషుల్లాగే బోరింగ్ కొట్ట‌డం స్టార్ట్ చేసింది.

ఇంకేముంది వ‌చ్చిన నీటిని బొట్టు కూడా వ‌ద‌ల‌కుండా తాగేసింది.

ఇలా చాలాసేపు బోరింగ్ కొడుతూ నీటిని తాగుతూ క‌డుపు నింపుకుంది.మ‌రి ఇంత శ్ర‌ద్ధ‌గా నీరు వృద్ధా కాకుండా చూసుకున్న ఏనుగు ప‌ని కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ వద్దకు వెల్లింది.

ఇక వారు కూడా నీటి విలువ‌ను తెలియ‌జేస్తూ ఈ వీడియోను త‌మ అధికారిక ట్విట్టర్ లో పోస్టు చేయ‌డంతో ఈజీగానే వైర‌ల్ అయిపోయింది.ప్ర‌స్తుతం చాలా దేశాలు నీటి కోసం ఎన్నో ర‌కాల ప్ర‌య‌త్నాలు మ‌రి కొన్ని అయితే యుద్ధం చేసుకునే పరిస్థితులు ఉన్నాయ‌ని, కాబ‌ట్టి నీటిని జాగ్ర‌త్త‌గా వినియోగించుకోవాల‌ని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube