మెగా హీరో సాయిధరమ్ తేజ్( Sai Dharam Tej ) తాజాగా విరూపాక్ష ( Virupaksha ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ సినిమా ఈనెల 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన ఎన్నో విషయాలను తెలియజేశారు.అలాగే సాయిధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న విషయం మనకు తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమా# PKSDT వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటుంది.అయితే ఈ సినిమా రీమేక్ చిత్రం కావడంతో పలువురు ఈ సినిమాపై విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ ఇద్దరూ కలిసి రీమేక్ సినిమాలో కాకుండా ఒరిజినల్ సినిమా చేస్తే బాగుంటుంది కదా.ఇక ఈ విషయం పవన్ కళ్యాణ్ వరకు చేరిందా? అనే ప్రశ్నలు ఎదురయ్యాయి.అయితే ఈ విషయంపై సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ… ఈ విషయం పవన్ కళ్యాణ్ మామయ్య వరకు చేరిందని తేజ్ వెల్లడించారు.ఈ సినిమా రీమేకా? కాదా అనే విషయాలను పక్కన పెడితే నన్ను చిన్నప్పటినుంచి పెంచినటువంటి వ్యక్తితో కలిసి నటించే, స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చింది.
ఇలా మామయ్యతో కలిసిన నటించడం నా డ్రీమ్.తనతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చినప్పుడు నాకు కలిగిన సంతోషాన్ని మాటల్లో చెప్పలేను.ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చినప్పుడు నేను ఎందుకు ఆ చాన్స్ మిస్ చేసుకుంటాను…ఇక చాలామంది ఈ సినిమాలే ఎందుకు… ఆ సినిమాలు చేయొచ్చు కదా అని చెబుతుంటారు.అయితే వాటి గురించి తాను ఏమాత్రం పట్టించుకోనని తెలిపారు.
మేం చేస్తున్న కథకు.మాతృక సినిమా కథకు సంబంధం లేదు.
పవన్ కళ్యాణ్ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని అందుకు అనుగుణంగానే స్క్రిప్ట్ లో మార్పులు కూడా చేశారని సాయిధరమ్ తేజ్ ఈ సందర్భంగా వెల్లడించారు.ఈ సినిమా గురించి సాయి తేజ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.