అలా టాయిలెట్ కి వెళ్ళి ఇలా పండంటి బిడ్డతో బయటకు వచ్చిన మహిళ..!

నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన తల్లికే తెలుసు పురిటి నొప్పులు ఎలా ఉంటాయో అనే విషయం.ఎందుకంటే ప్రతి మహిళకు బిడ్డను ప్రసవించిడం అంటే మరో జన్మ ఎత్తడమే.అయితే అప్పట్లో ఈ సిజేరియన్స్ అనేవి చాలా తక్కువగా చేసేవారు.100 లో 95% మంది మహిళలు నార్మల్ డెలివరీ ద్వారానే బిడ్డకు జన్మనిచ్చేవాడు.కానీ ఈ కాలంలో చాలా మందికి పురిటి నొప్పులు అంటే ఏంటో తెలియవు.ప్రతి ఒక్కరు కూడా ఆపరేషన్ కే ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారు.అలా అందరు ఆ కోవలోకి వస్తారని చెప్పడంలేదు.ఎందుకంటే పురిటి నొప్పుల సమయం దగ్గర పడినప్పుడు ఎప్పుడు డెలివరీ అవుతుందో ఎవరికీ తెలియదు.

 The Woman Who Went To The Toilet And Came Out With Such A Fruitful Child, Women-TeluguStop.com

అయితే చాలా సందర్భాల్లో మనం ఏ టాయిలెట్‌లోనూ,ప్రభుత్వ ఆస్పత్రిలోని బాత్‌ రూం లోకి వెళ్లిన మహిళకు అనుకోకుండా బిడ్డ పుట్టాడనే సంఘటనల గురించి మనం వినే ఉంటాము.

సరిగ్గా ఇప్పుడు కూడా అలాంటి అనుకోని ఘటన ఒకటి యూకేలో ఉన్న పెట్రోల్ బంక్ టాయిలెట్స్ లో చోటుచేసుకుంది.

అసలు వివరాల్లోకి వెళితే.యూకేకి చెందిన కైట్లిన్ ఫుల్లెర్టన్, సెర్గియో అనే దంపతులు సరదాగా షికారుకు వెళదామని కారులో బయటకు వచ్చారు.

కొద్దిసేపు అయ్యాక కైట్లిన్ కు టాయిలెట్ రావడంతో ఏమి చేయాలో అర్ధం కాలేదు.ఎందుకంటే కైట్లిన్ నిండు గర్భిణీతో ఉంది.

సమీపంలో ఎక్కడన్నా పబ్లిక్‌ టాయిలెట్స్‌ ఉన్నాయేమో అని చూడగా ఎక్కడా కనిపించలేదు.చేసేది లేక పక్కనే ఉన్న పెట్రోల్‌ బంక్‌ లోని బాత్‌ రూంలోకి వెళ్లింది.

అయితే అక్కడ ఆమెకి సడెన్ గా నొప్పులు మొదలైయ్యాయి.

ఆ తరువాత కేవలం 10 నిమిషాల్లోనే ఒక పండంటి మగ బిడ్డకు జన్మ నిచ్చింది.

షాక్ లో ఉన్న కైట్లిన్ కొద్దిసేపటికి తేరుకుని అక్కడే ఉన్న కొంత మంది మహిళలతో ఏ విషయాన్న తన భర్తకు తెలియజేయడంతో వెంటనే కైట్లిన్ భర్త సెర్గియో వచ్చి సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు.తల్లి బిడ్డలు సురక్షింతంగానే ఉన్నారని అక్కడి వైద్యులు చెప్పారు.

ప్రస్తుతం టాయిలెట్ లో బిడ్డకు జన్మనిచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.అలాగే తనకు జరిగిన ఈ అనుభవాన్ని కైట్లిన్ ఈ వీడియో ద్వారా అందరికి చెప్పింది.

అలాగే ఆ బాబుకు కెల్లీహిన్ అనే పేరు కూడా పెట్టారు.ఈ వీడియో చూసి నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube