వైరల్: ఆ కారణం చేత 17 ఏళ్ల తర్వాత ఏకంగా 6 అడుగుల జట్టు కత్తిరించుకున్న మహిళ..!

పొడవాటి జట్టుతో ప్రపంచ రికార్డులు, గిన్నిస్‌ రికార్డుల్లో తమ పేరుని లిఖించుకున్న ఆడవారిని మీరు చూసే ఉంటారు.కానీ ఒక మహిళ మాత్రం జుట్టు కత్తిరించుకుని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కింది.నమ్మలేకపోతున్నారా? అయితే మీరు మహిళ గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిందే.

 The Woman Who Cut The 6-foot Team All Together After 17 Years For That Reason ..-TeluguStop.com

నల్లగా నిగనిగలాడే పొడవాటి శిరోజాలు పెంచేందుకు మహిళలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

చాలామంది మహిళలు మార్కెట్లో దొరికే వివిధ రకాల హెయిర్ ప్రొడక్ట్స్ కూడా వాడుతుంటారు.అయితే ఉత్తర వర్జీనియాకు చెందిన జహాబ్‌ కమాల్‌ ఖాన్‌ ఎటువంటి స్పెషల్ ప్రొడక్ట్స్ వాడకుండానే ఆరడుగుల పొడవాటి జుట్టును పెంచుకుంది.

ఇందుకు తన అమ్మమ్మ ఇచ్చిన హెయిర్‌ ఆయిల్‌ను మాత్రం యూజ్ చేసింది.అయితే 17 ఏళ్ల పాటు జుట్టు కత్తిరించుకోకుండా ఉన్న ఆ 30 ఏళ్ల మహిళ ఆరు అడుగుల పైగా జట్టు పెంచింది.

ఎంతో అపురూపంగా చూసుకున్న తన జుట్టును ఎట్టకేలకు కత్తిరించుకుంది.అది కూడా ఒక మంచి పని కోసమే కత్తిరించుకుని అందరి హృదయాలను గెలుచుకుంటోంది.

సాధారణంగా క్యాన్సర్‌ రోగులు చికిత్స సమయంలో తమ జుట్టును కోల్పోతుంటారు.క్యాన్సర్ బారిన పడిన చిన్నారుల్లో ఈ సమస్య మరింత భయాందోళనకు గురిచేస్తుంది.అలాంటి పిల్లల విగ్గుల కోసమే జహాబ్‌ కమాల్‌ ఖాన్‌ తన జట్టును కత్తిరించుకుంది.దాంతో ఆమె అందరి ప్రశంసలు అందుకోవడంతో సహా ‘పొడవాటి జుట్టును దానం చేసిన వ్యక్తి’గా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది.

Telugu Feet, Latest-Latest News - Telugu

జహాబ్‌ కమాల్‌ ఖాన్‌ పాకిస్థాన్‌లో పుట్టి పెరిగింది.ఆమె మంచి స్క్వాష్‌ క్రీడాకారిణిగా పేరు కూడా తెచ్చుకుంది.ఆరడుగుల జుట్టుతోనే ఆమె స్క్వాష్‌ ఆటలో ఆడేది.అయితే ఒక రోజు కరాచీ వేదికగా ఓ స్క్వాష్‌ మ్యాచ్‌ జరిగింది.ఆ సమయంలోనే ఆమె కొప్పు జుట్టు ముడి విడిపోయి ఆరు అడుగుల వరకు విస్తరించింది.దాంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు.

ఆ తర్వాత ఆమె పొడవాటి జుట్టు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.మూడేళ్ల క్రితం వరకు పాకిస్థాన్‌లో ఉన్న ఆమె వర్జీనియాకు మకాం మార్చి అక్కడే సెటిల్ అయిపోయింది.

తంలో ఈమె 1,100 ప్లాస్టిక్‌ బటర్‌ ఫ్లై హెయిర్‌ క్లిప్స్‌తో తన జుట్టును ముడేసుకుంది.ఇప్పటివరకూ ఈ పని ఎవరివల్లా సాధ్యం కాలేదు.దాంతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థ తమ బుక్కులో ప్రత్యేకమైన స్థానాన్ని ప్రధానం చేసింది.వర్జీనియా రాపంజెల్‌ గా పేరు తెచ్చుకున్న ఈమె ప్రస్తుతం పొడవైన జట్టు ఉన్న మహిళగా మాత్రమే కాదు విశాలమైన హృదయం గల మహిళగా కూడా పేరు తెచ్చుకుంటోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube