వ్యాధితో గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేసిన మ‌హిళ‌.. ఎలాగో తెలుసా?

గిన్నిస్ రికార్డులోకి ఎక్కడం అంటే మామూలు విషయం కాదు.చాలా ప్రత్యేకత ఉంటే తప్ప అది సాధ్యమవదు.

 The Woman Who Created The Guinness Record For The Disease Details, Guinness Reco-TeluguStop.com

కానీ ఒక మహిళ తనకున్న వ్యాధితో గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది.ఇంతకి ఎవరు ఆమె? ఎక్కడ ఉంటుంది? ఆమెను గిన్నిస్ బుక్‌లోకి ఎక్కించిన వ్యాధి ఏంటి? అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది చదవాల్సిందే.

గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాలని చాలా మంది కలలు కంటుంటారు.ఆ కలను నిజం చేసేందుకు ఎంతో కష్టపడుతుంటారు.దాని కోసం వారు చేయని ప్రయత్నాలు ఉండవు.కానీ టర్కీకి చెందిన రుమైసాగెల్లి అనే మహిళ కేవలం తనకున్న వ్యాధితోనే గిన్నిస్ రికార్డు సాధించింది.

ఇన్ని రోజులు వ్యాధి కారణంగా అనారోగ్యంతో ఆమె బాధపడుతుండటంతో ఆమెను చూసిన ఆమె తల్లిదండ్రులు.తమ బిడ్డ ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నదని చెబుతున్నారు.

ఇంతకీ ఏమైందంటే రుమైసా గెల్లికి వీవర్స్ సిండ్రోమ్ అనే వ్యాధి ఉంది.24 సంవత్సరాల వయసున్న ఆమె.ఈ వ్యాధి కారణంగా 7 అడుగుల ఒక్క అంగుళం ఎత్తు పెరిగింది.వ్యాధి కారణంగానే ఆమె పొడవు అసాధారణంగా పెరిగింది.

కానీ, ఆమె ఎముకలు ఎక్కువ బలంగా లేకపోవడంతో ఆమె ఎక్కువ శాతం వీలై చైర్ కే పరిమితమైంది.

Telugu Guinness, Rumaisa Gelly, Tollest, Trukey-Latest News - Telugu

నడవాల్సి వస్తే వాకర్ సహాయంతో నడుస్తున్నది.పొడవు విషయంలో ఆమె 2014లోనే ప్రపంచంలో పొడవైన టీనేజర్‌గా గిన్నిస్ రికార్డులో పేరు సంపాదించుకుంది.తాజాగా ఆమె ఎత్తును గిన్నిస్ రికార్డ్స్ బృందం మళ్లీ కొలిచింది.

దీంతో మరోసారి ఆమె రికార్డ్ సృష్టించింది.రుమైసాగెల్లి కంటే ముందు చైనా దేశానికి చెందిన జెంగ్ జిలియన్ అనే మహిళ ప్రపంచంలో అత్యంత పొడవైన మహిళగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది.ఆమె 8.1 అడుగుల పొడవు ఉండేది.1982లో ఆమె చనిపోయింది.అదే సమయంలో అత్యంత పొడవైన వ్యక్తిగా టర్కీ సుల్తాన్ పేరుమీద రికార్డు ఉండేది.2018‌లో అతని ఎత్తు 8.2 అడుగులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube