ముందు చూపుతో నిండు ప్రాణం కాపాడిన మ‌హిళా కానిస్టేబుల్‌..

The Woman Constable Who Saved The Life Of The Front Sight

ఉద్యోగం పురుష ల‌క్ష‌ణం అంటారు.కానీ ఇప్పుడు ఆ సామెత ఔట్ డేటెడ్ అయిపోయింది.

 The Woman Constable Who Saved The Life Of The Front Sight-TeluguStop.com

ఉద్యోగం అనేది జెండ‌ర్ ను చూసి కాదు, సామ‌ర్థ్యం, టాలెంట్‌ను చూసి వ‌స్తున్నాయి.అందుకే ఇప్పుడు మ‌హిళ‌లు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.

చిన్న క్ల‌ర్క్ స్థాయి ఉద్యోగం నుంచైతే, క‌లెక్ట‌ర్, మినిస్ట‌ర్‌, ప్రైమ్ మినిస్ట‌ర్ ప‌ద‌వులు కూడా అలంక‌రిస్తున్నారు.మ‌హిళ‌లను ప్ర‌భుత్వాలు కూడా ప్రోత్స‌హిస్తున్నారు.

 The Woman Constable Who Saved The Life Of The Front Sight-ముందు చూపుతో నిండు ప్రాణం కాపాడిన మ‌హిళా కానిస్టేబుల్‌..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చాలా ప్ర‌భుత్వ రంగాల్లో వారి కోసం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తున్నాయి.కొన్ని ఉద్యోగాలు ప్ర‌త్యేకంగా వారికే కేటాయిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో కూడా పోలీసు ఉద్యోగాల్లో 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించారు.మిగితా రాష్ట్రాల్లో కూడా ఇలా రిజ‌ర్వేష‌న్లు అమ‌ల‌లో ఉన్నాయి.

చ‌ట్ట స‌భ‌ల్లో ప్రాతినిధ్యం వ‌హించే మ‌హిళ‌ల సంఖ్య కూడా పెరిగిపోయింది.దివంగ‌త ప్ర‌ధాని ఇందిరా గాంధీకి చాలా శ‌క్తివంత‌మైన మ‌హిళ‌గా పేరుంది.

ఇప్ప‌టికీ లెజెండ‌రీ ప్రై మినిష్ట‌ర్ అంటూ ఆమెను కొనియాడుతారు.ఆమె తీసుకున్నంత ధైర్యంగా ఎవ‌రూ నిర్ణయాలు తీసుకోలేర‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతుంటారు.

చాలా మంది మ‌హిళా ఉద్యోగుల త‌మ విధులను చాలా బాధ్య‌త‌గా నిర్వ‌హిస్తారు.ఉద్యోగ బాధ్య‌త‌ల్లో భాగంగా ఎంత‌టి ధైర్య, సాహ‌సాలకైనా ఒడిగ‌డుతారు.అలాంటి ఘ‌ట‌నే మ‌హారాష్ట్రలోని ముంబైలో జ‌రిగింది.అక్క‌డి షాండ్ హ‌ర్డ్స్ రోడ్‌లో ఉన్న రైల్వే స్టేష‌న్‌లో ఆర్‌పీఎఫ్ లో మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వ‌హిస్తోంది స్వ‌ప్నా గోల్క‌ర్‌.

ఇటీవ‌ల స్టేష‌న్ లో విధులు నిర్వ‌హిస్తున్న క్రమంలో క‌దులుతున్న ట్రైన్ ఎక్కేందుకు ఓ మ‌హిళ ప్ర‌య‌త్నించింది.కానీ ఆమె కింద ప‌ట్టాల‌పై ప‌డ‌పోయింది.ఇది గ‌మ‌నించిన స‌ప్నా గోల్క‌ర్ హుటా హుటిన స్పందిచారు.క‌దులుతున్నట్రైన్ లో నుంచి ప‌ట్టాల‌పై ప‌డ‌బోయిన మ‌హిళ‌ల ద‌గ్గ‌రి వెళ్లి స్పీడ్‌గా వెన‌క్కి లాగింది.దీంతో ఆ మ‌హిళ ప్రాణాలు పోకుండా కాపాడ‌గ‌లిగింది.ఇదంతా అక్క‌డున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చల్ చేస్తోంది.

#Saved Lfe #Mumbai #Swapna Golker #Maharashtra #Womans

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube