యాదాద్రి భువనగిరి జిల్లా: బొమ్మలరామారం మండల( Bommalaramaram Mandal ) వ్యాప్తంగా ఇటుక బట్టీల యాజమాన్యాలపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.మండలంలోని ఇటుక బట్టీల( Brick-kilns ) యజమాన్యాలు ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామాల్లోని కుంటలు,చెరువుల నుండి అడ్డూఅదుపూ లేకుండా మట్టిని తవ్వుతూ టిప్పర్ల ద్వారా యధేచ్చగా అక్రమ రవాణా చేస్తున్నారు.
రాత్రి పగలు తేడా లేకుండా మట్టిని తరలించే టిప్పర్ల వల్ల దుమ్ము,ధూళి రోడ్లులపై పడటంతో పాటు,రోడ్లు కూడా కరాబ్ అవుతున్నాయి.
దీనితో ఇతర వాహనాలకు, ప్రయాణికులకు ఇబ్బందిగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ మట్టి దందా వల్ల అనేక ప్రమాదాలు కూడా జరిగాయనిఅంటున్నారు.మండల పరిధిలోని ఇటుక బట్టీల్లో ఇతర రాష్ట్రాల నుండి వలస కార్మికులను తీసుకొచ్చి కనీస వేతనాలు చెల్లించకుండా,శ్రమ దోపిడికి పాల్పడుతూ,చిన్న పిల్లలతో కూడా పని చేయించుకుంటూ యాజమాన్యాలు లాభాలు గడిస్తున్నారని చెబుతున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మండలంలోని ఇటుక బట్టీలపై ప్రత్యేక ఫోకస్ పెట్టి,అక్రమ మట్టి దందా,కార్మికుల సౌకర్యాల,పనికి తగినవేతనం, బాల కార్మికులు( Child labor ) శ్రమ దోపిడిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.