చెట్లతో సహా భూమినే ఎత్తేసిన గాలి.. వైరల్ వీడియో చూస్తే స్టన్!

The Wind Lifted The Earth Including The Trees , Viral Video , Latest News, Storm Babet, Mugdock Forest, Wind , Forest Floor , Shallow Roots , David Nugent Malone

ప్రకృతిలో ఎన్నో అద్భుతమైన ఘటనలు జరుగుతుంటాయి.ఇవి అరుదుగా ప్రజల కంటపడతాయి.

 The Wind Lifted The Earth Including The Trees , Viral Video , Latest News,-TeluguStop.com

అయితే ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్లు ఉండటం వల్ల వాటిని ఫోన్లలో బంధించి అందరికీ షేర్ చేస్తున్నారు.అలా షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ( Social media )వైరల్ అయ్యి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.ప్రముఖ వైరల్ వీడియో( Viral video ) షేరింగ్ పేజీ సీసీటీవీ ఇడియట్స్ షేర్ చేసిన ఈ వీడియోకు రెండు లక్షల వరకు వ్యూస్ వచ్చాయి.43 సెకన్ల నిడివి గల ఈ వీడియో చూసి నెటిజన్లు అబ్బురపడుతున్నారు.

వివరాలకు వెళ్తే, ఇటీవల స్కాట్లాండ్‌ దేశం, స్టిర్లింగ్‌షైర్ కౌంటీలోని ముగ్‌డాక్ ఫారెస్ట్‌ను స్టార్మ్ బాబెట్( Storm Babette ) అనే తుఫాను తాకింది.ఆ సమయంలో గాలి చాలా బలంగా వీచింది.దాంతో భూమి కంపించింది.డేవిడ్ నుజెంట్-మలోన్ అనే ఒక డాగ్ వాకర్ అటువైపుగా వెళ్తూ ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూశాడు.ఆ సమయంలో అడవి నేల పెద్ద డర్ట్ కెరటంలా మొత్తం పైకి, కిందకు కదిలింది.చెట్లకు చాలా చిన్న వేర్లు ఉన్నందున చెట్లతో సహా ఆ భూమి పొర అనేది పైకి లేసి కింద పడింది.

అతనితో పాటు వచ్చిన కుక్క పైకి లేచి కింద పడుతున్న నెల మీదకి కూడా ఎక్కింది.అది అలా ఆ భూప్రదేశాన్ని ఎక్కిన కొన్ని సెకన్లలో భూమి మళ్లీ పైకి లేచింది.

దాంతో కుక్క చాలా భయపడిపోయింది.

గాలి భూమిని సులభంగా నెట్టేసింది, భూమిని పైకి లేపగలిగింది.ఈ టైమ్ లో అడవి( Forest ) సజీవంగా ఉండి ఊపిరి పీల్చుకున్నట్లు కనిపించింది.ఇది చూసిన ప్రజలు చాలా ఆశ్చర్యానికి లోనయ్యారు.

ఇది ఒక మురికి గుడ్డను పైకి ఎత్తినట్లు ఉందన్నారు.ప్రకృతి ఎంత శక్తివంతంగా ఉంటుందో ఈ వీడియో( video ) చూస్తే అర్థమవుతుందని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube