కరోనా సోకిందంటే ఏ బంధం అయినా కానివారేనా.. ?

ఒక్క కాకి చనిపోతే వంద కాకులు వస్తాయని అంటారు.కానీ నేడు సమాజంలో ఒక్క మనిషి చనిపోతే కనీసం నలుగురు కూడా రావడం గగనంగా మారింది.

 The Wife Who Pushed Her Husband Out Of The-TeluguStop.com

అంటే నేడు కరోనా వల్ల మానవ సంబంధాలన్నీ నోరు లేని పక్షుల కంటే అధ్వాన్నంగా మారాయని అర్ధం అవుతుంది.
నిజానికి ఏ బంధం అయినా ఉంటే అద్ధంలా ఉండాలి లేకపోతే నీడలా ఉండాలి ఇలా ఎందుకంటే అద్దం అబద్దం చెప్పదు.

నీడ మరణించే వరకు వదిలి వెళ్ళదు.కానీ మానవ తప్పిదం వల్ల ప్రజల మీద విరుచుకు పడుతున్న కరోనా వల్ల కన్నపేగైనా.కట్టుకున్న భర్తైనా కాని వారిలా మారుతున్నారు.

 The Wife Who Pushed Her Husband Out Of The-కరోనా సోకిందంటే ఏ బంధం అయినా కానివారేనా.. -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జగిత్యాల విద్యానగర్ లో ఇలాంటి దారుణ ఘటన చోటు చేసుకుంది.ఆ వివరాలు చూస్తే.ఇందయ్య అనే 80 ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అప్పటికే వేరుగా ఉంటున్న కొడుకు తండ్రికి సపర్యలు చేసాడు.దీంతో అతనికి కూడా కరోనా సోకింది.

ఈ క్రమంలో అతని భార్యతో కిరాయికి ఉంటున్న చోటుకు ఈ వృద్దుడి కొడుకు వెళ్లి పోయాడు.

దీంతో ఈ వృద్దుడి భార్య భర్తను ఇంట్లోంచి వెళ్లగొట్టి తలుపులు పెట్టేసుకుంది.ఈ విషయం తెలిసిన కొడుకు, కోడలు వచ్చి మల్లవ్వను ఎంత బ్రతిమిలాడిన కనికరించ లేదట.

కరోనా తగ్గే వరకు ఆయన బయటే ఉండాల్సిందేనని అంటూ తలుపులు తీయడానికి నిరాకరించిందట.ప్రస్తుతం ఈ ఘటన స్దానికంగా చర్చనీయాంశంగా మారింది.చూశారా కరోనా ముందు బంధాలు ఎలా ఓడిపోతున్నాయో.

#Wife #Jagityal #Husband #Vidyanagar #Infected

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు