ప్రస్తుత సమాజంలో వివాహ బంధాల కంటే వివాహేతర బంధాలకే(extramarital affairs ) అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వస్తే విడిపోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ క్రమంలోనే మానవ సంబంధాలు క్షీణించిపోతున్నాయి.ముఖ్యంగా వివాహం అయిన తర్వాత ఎవరో ఒకరు వివాహేతర సంబంధం పెట్టుకొని కుటుంబాన్ని రోడ్డున పడేసిన సంఘటనలే ఈ మధ్య ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి.
ఇలాంటి కోవలోనే ఖమ్మం జిల్లాలో ఓ వివాహిత తన భర్తకు ఊహించని షాక్ ఇచ్చింది.దీంతో ఆ భర్త ప్రాణాలు తీసుకున్నాడు.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.ఖమ్మం జిల్లా మదికొండ ( Khammam District Madikonda )మండలం బాణాపురం గ్రామంలో నివాసం ఉండే వంశీ( Vamsi ) అనే వ్యక్తికి ఐదేళ్ల క్రితం గోకినేపల్లి కు చెందిన యువతితో వివాహం అయ్యింది.వీరికి ఒక కుమారుడు సంతానం.
వీరి సంసారం కొంతకాలం సాఫీగానే సాగింది.కానీ వంశీ భార్య పెట్టుకున్న వివాహేతర సంబంధం వీధి కాపురంలో చిచ్చు పెట్టింది.
భార్య వివాహేతర సంబంధం గురించి భర్త వంశీకి తెలియడంతో ఇలాంటి పనులు మానుకోవాలని పలుమార్లు భార్యను హెచ్చరించాడు.కానీ భర్త చెప్పిన కూడా భార్యలో మార్పు రాకపోగా.
ఏకంగా ప్రియుడుతో కలిసి కొత్త కాపురం పెట్టేసింది.భర్త వంశీ ఎన్ని విధాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేసిన తనకు ప్రియుడే ముఖ్యం అని తెగేసి చెప్పేసింది.

ఒకవేళ తాను కావాలని అనుకుంటే భర్తనే తన వద్దకు వచ్చేయాలని.ప్రియుడుతో కలిసి అందరం ఒకే ఇంట్లో ఉందామని కండిషన్ పెట్టింది.భార్య ఆ మాట చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురైన వంశీ తట్టుకోలేక ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.మృతుడి తండ్రి శివయ్య తెలిపిన వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.