భార్యను.. పిల్లనిచ్చిన మామను వెంటాడిమరీ చంపేశాడు.. అసలు ఏం జరిగింది.?

భార్యను పిల్లనిచ్చిన మామను వెంటాడిమరీ చంపేశాడు అసలు ఏం జరిగింది.?కరీంనగర్ లో దారుణం చోటుచేసుకుంది.కుటుంబ గొడవల నేపథ్యంలో కట్టుకున్న భార్యను పిల్లనిచ్చిన మామను హత్య చేసిన ఘటన సోమవారం రాత్రి కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం శ్రీనివాస్ నగర్ లో గుట్ట సమీపంలో జరిగింది‌. స్థానికుల వివరాల మేరకు వెల్ది గ్రామానికి చెందిన లావణ్య(34) అన్నారా గ్రామానికి చెందిన రమేష్ కు వివాహం అయింది.

 The Wife The Uncle Who Gave Birth To The Child Was Killed Immediately What Actually Happened-TeluguStop.com

రమేష్ ఆర్టీసీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.మనస్పర్ధలు రావడంతో గత రెండు నెలలుగా భార్యాభర్తలిద్దరూ దూరంగా ఉంటున్నారు.  గొడవల నేపథ్యంలో పుట్టింట్లో ఉంటున్న లావణ్య తన భర్తపై కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేసింది‌.

పోలీసులు భార్యాభర్తలిద్దరికీ పిలిచి నచ్చజెప్పారు.

 The Wife The Uncle Who Gave Birth To The Child Was Killed Immediately What Actually Happened-భార్యను.. పిల్లనిచ్చిన మామను వెంటాడిమరీ చంపేశాడు.. అసలు ఏం జరిగింది.-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో రమేష్ మనస్తాపం చెందాడు.

నిన్న రాత్రి భార్య లావణ్య మామ ఓదేలు కుమార్ అజిత్ కుమార్, కుమార్తె అక్షిత  ఆటోలు వెల్ది కి వస్తుండగా రమేష్ అతని సోదరుడు అనిల్ తో కలిసి బైక్ పై వారిని వెంబడించారు.దారిలో ఆటోను ఆపి భార్య, మామ పై దాడి చేసి కత్తితో గొంతు కోశారు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

దాడిని అడ్డుకోబోయిన కుమార్తె చేతికి గాయం అయింది.అనంతరం నిందితులిద్దరూ స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.మృతిచెందిన మామ సింగరేణి విశ్రాంత ఉద్యోగి.ఏసీపీ విజయ సారథి, సిఐ కృష్ణారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

#And Her Father #Died #Crime #Lavanya #Karim Nagar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు