భర్త గొడవ పడటం లేదని భార్య కోర్టులో ఫిర్యాదు

ఇప్పటి వరకూ భార్యలు నా భర్త నన్ను పట్టించుకోవడం లేదు.తాగి నాతో గొడపడుతున్నాడు అని, భరించలేక భర్తకు విడాకులు, లేదా గొడవ పడి పుట్టింటికీ వెళ్లిన భార్యలను చూస్తునే ఉంటాం.

 Uttarapradesh, Women, Divorce, Court-TeluguStop.com

భర్త ప్రేమించడం లేదని ఆరోపించే భార్యలను చూశాం కానీ, భార్యపై ప్రేమ కురింపించిన భర్తను వదిలించుకోవాలని భార్య కోర్టును ఆశ్రయించడం బహుశా ఇప్పుడే చూస్తున్నాం.తనను ఎంతో బాగా చూసుకుంటున్నాడని, ఏ రోజు గొడవ పడటం లేదని, తప్పు చేసినా తిట్టనైనా తిట్టడని ఓ భార్య ఆరోపిస్తుంది.

విడాకులు కావాలని కోర్టును ఆశ్రయిస్తే కోర్టే చేతులెత్తేసింది.

ఉత్తరప్రదేశ్ లోని సంభల్ జిల్లాకు చెందిన ఓ ముస్లిం జంట ఓ ఏడాది క్రితం వివాహం జరింగింది.

అయితే, ఆమె విడాకులు కావాలని షరియా కోర్టును ఆశ్రయించింది.నా భర్త కురిపించే ప్రేమను తట్టుకోలేకపోతున్నానని, ఆయన నాతో గొడవ పడటం లేదని, తప్పు చేసినా క్షమిస్తున్నాడని, ప్రతి దానికి సర్దుకుపోతున్నాడని, ఇలాంటి వాతావరణంలో నాకు భరించడం కష్టంగా ఉందని ఆమె కోర్డుకు విన్నవించుకుంది.

అయితే భర్తను అడిగితే నా భార్య ఎప్పుడూ సంతోషంగా ఉండాలని అనుకుంటున్నానని, దయచేసి విడాకులు ఇవ్వొద్దని కోర్టును కోరడంతో కోర్టు ఫిర్యాదును కొట్టేసింది.దీంతో ఆ మహిళ పంచాయతీ పెట్టి పెద్దలకు తన సమస్యను తెలిపింది.

పంచాయతీ పెద్దలు కూడా చేతులెత్తేశారు.అయితే ఆ మహిళ మొగుడు అన్నప్పుడు అప్పుడప్పుడు కోపం చూపించాలని, కొట్టకపోయినా పర్వాలేదు, గట్టిగా మందలించాలి లేదా తిట్టాలి అని పేర్కొంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube