ప్రముఖ ఈ-కామర్స్ సంస్థపై ఈడీ ఫైన్.. ఎందుకంటే?

ప్రజెంట్ సిచ్యువేషన్స్‌లో ప్రతీ ఒక్కరు ఫిజికల్‌గా షాప్స్‌కు వెళ్లి ఐటమ్స్ షాపింగ్ చేసే బదులు ఆన్‌లైన్ వేపునకే మొగ్గు చూపుతున్నారు.మరీ ముఖ్యంగా కొవిడ్ కట్టడికి విధించిన లాక్ డౌన్ టైం నుంచి ఆన్ లైన్‌లోనే జనాలు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

 The Whole Fine On A Leading E Commerce Company Because-TeluguStop.com

ఇకపోతే ఈ కామర్స్ సంస్థలకు కూడా భారీ లాభాలే వచ్చినట్లు సమాచారం.కాగా, ప్రముఖ ఈ కామర్స్ సంస్థ వాల్‌మార్ట్ హెవీ ఫైన్ విధించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సిద్ధపడింది.ఈ క్రమంలోనే ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్స్ యాక్ట్స్‌ను ఉల్లంఘించినందుకుగాను ఫ్లిప్ కార్ట్‌కు ఎందుకు 1.35 బిలియన్ డాలర్ల ఫైన్ విధించకకూడదో చెప్పాలంటూ సంస్థకు తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.ఫ్లిప్‌కార్ట్ సంస్థ ఫౌండర్స్ సచిన్ బన్సల్, బిన్ని బన్సల్‌, ప్రస్తుత ఇన్వెస్టర్ టైగర్ గ్లోబల్‌లకు నోటీసులు అందినట్లు తెలుస్తోంది.

విదేశీ పెట్టుబడుల చట్టాలను ఫ్లిప్ కార్ట్ సంస్థ ఏళ్లుగా ఉల్లంఘిస్తున్నట్లు ఈడీ వద్ద ఆధారాలున్నట్లు తెలుస్తోంది.

 The Whole Fine On A Leading E Commerce Company Because-ప్రముఖ ఈ-కామర్స్ సంస్థపై ఈడీ ఫైన్.. ఎందుకంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా, విచారణ అనంతరమై ఈడీ నోటీసులు జారీ అయ్యాయి.చెన్నై కేంద్రంలోని ఫ్లిప్ కార్ట్ ఆఫీసుకు నోటీసులు పంపింది ఈడీ.ఇకపోతే వెబ్ సైట్‌లో ఫ్లిప్ కార్ట్ జరిపే అమ్మకాలు చట్టాలను ఉల్లంఘించి చేస్తున్నవనే ఆరోపణలు ఉన్నాయి.ఈడీ నోటీసులపై ఫ్లిప్ కార్ట్ ప్రతినిధి స్పందించారు.

తమ సంస్థ ఇండియన్ యాక్ట్స్, రూల్స్ కట్టుబడి మాత్రమే పని చేస్తుందని చెప్పారు.దర్యాప్తు సంస్థ విచారణకు తాము పూర్తిగా సహకరిస్తామని, 2009-15 టైం పీరియడ్‌కు సంబంధించిన పలు అంశాలపై ఈడీ నుంచి నోటీసులు వచ్చాయని, వాటిపై వివరణ ఇస్తామని తెలిపారు.

మార్కెట్‌లో ఫ్లిప్ కార్ట్ సంస్థకు బోలెడన్నీ ఈ-కామర్స్ సంస్థలు పోటీగా వచ్చినప్పటికీ ఫ్లిప్ కార్ట్ పోటీని తట్టుకుని నిలదొక్కుకోగలిగిందని చెప్పొచ్చు.కాగా, ఫ్లిప్ కార్ట్ ఈడీ దర్యాప్తు మాత్రమే కాకుండా అనేక దర్యాప్తులను ఎదుర్కొంటోంది.

#DirectorateOf #E Commers #Flipcart #TheWhole #E Commerce

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు