వైరల్ వీడియో: తన పిల్లలతో తెగ ఆడుకుంటున్న తల్లి బాతు..!

ఈ సృష్టిలో తల్లిని మించిన దైవం మరొకరు లేరు అని అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.పుట్టిన దగ్గర నుండి తన పిల్లలకు పెద్ద అయ్యేదాకా మంచి చెడు చెప్పి వాళ్ళను సరైన మార్గంలో పెట్టేది అమ్మ.

 Viral Video Mother Duck Playing Crazy With The Ducklings , Mother,duck, Hide-and-TeluguStop.com

ప్రతి పిల్లలకు అమ్మే మొదటి గురువు అలాగే అమ్మే మొదటి స్నేహితురాలు.చిన్నప్పుడు అమ్మ మనతో దాగుడు మూతలు ఆట ఆడేది మీకు గుర్తు ఉందా.

మనల్ని కళ్ళు మూసుకోమని అమ్మ దాక్కుంటే అమ్మని వెతుక్కుంటూ వెళ్లి అమ్మ ఎక్కడ ఉందో తెలుసుకుని పట్టుకునే వాళ్ళం కదా.ఆ రోజులు ఎప్పటికి మరచిపోలేము.ఇప్పుడు ఇలాంటి దాగుడు మూతల ఆటను ఒక క్రెజీ బాతు తన పిల్లలతో ఆడింది తెలుసా.దీనికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

ఆ వీడియోని చూసిన నెటిజన్లు తెగ లైక్స్, కామెంట్ చేసేస్తున్నారు.

హైడ్ అండ్ సీక్ ఆటకు సంబందించిన బాతు వీడియోను బ్యూటెండేబీడెన్ అనే ఖాతాలో నిన్న అప్‌లోడ్ చేశారు.

ఈ వీడియో నిడిది 24 సెకన్ల పాటు మాత్రమే ఉంటుంది.ప్రస్తుతం ఈ వీడియోకి లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఇప్పుడు సోషల్ మీడియాలో జంతువులు, పక్షులు చేసే విన్యాసాలను చూడడానికి నెటిజన్లు బాగా ఆసక్తి చూపిస్తున్నారు.అందుకనే ఈ వీడియోను మీ అందరితో పంచుకుంటున్నాము.

అసలు ఈ వీడియోలో ఏముందంటే ఓ బాతు, ఆ బాతు పిల్లలు ఒక కొలనులో సరదాగా తిరుగుతూ ఆడుకుంటూ ఉంటాయి.అయితే ఉన్నటుండి ఒక్కసారిగా తల్లి బాతు పిల్లలకు కనపడకుండా నీటిలో మునిగి పోతుంది.పిల్లలు తల్లి బాతు కోసం వెతుకుంటూ ఉంటారు.ఇంతలోనే తల్లి బాతు కొంత దూరంలో పైకి తేలుతుంది.తల్లిని చూసిన పిల్లలు వెంటనే ఒకదాని తరువాత ఒకటి లైన్ గా మళ్ళీ నీటిలోంచి బయటకువచ్చిన తల్లిని వెతుక్కుంటూ వెళ్తాయి.పిల్లలు తల్లిని చేరిన వెంటనే మళ్ళీ తల్లి బాతు పిల్లలకు కనపడకుండా మరోసారి నీటిలో మునిగి ఇంకోచోట తేలుతుంది.

మరలా పిల్లలు తల్లిని వెతుకుంటూ ఉంటాయి.

మళ్ళీ కొంత దూరంలో తల్లి పైకి తేలడం అదే ఇలా బాతు పిల్లలు తల్లిని చేరడం, తల్లి నీటిలో మునగడం చేస్తూ సరదాగా ఆడుకుంటూ ఉంటాయి.బాతు, బాతు పిల్లలు ఇలా సరదాగా ఆడుకుంటున్న వీడియోపై నెటిజన్లు తమ స్టైల్ లో కామెంట్లు పెడుతున్నారు.ఈ క్లిప్‌ ఇప్పటి వరకు వేల సంఖ్యలో లైక్‌ లు, రీట్వీట్‌ లతో హల్ చల్ చేస్తోంది.

ప్రతి తల్లి పిల్లలకు అవి ఎలా బతకాలో నేర్పిస్తుందని, అలాగే ఆపదలు వచ్చినప్పుడు వాటి నుండి ఎలా తప్పించుకోవాలో కూడా నేర్పిస్తుందని., అందుకే మన పెద్దలు మాతృదేవోభవ అని సంబోధించారని కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube