వైరల్ వీడియో: ధైర్యం అనే పదానికి సాక్షిగా నిలుస్తున్న యువతి..!

ఈ విశాలమైన భూభాగంలో మనుషులతో పాటు అనేక రకాల జీవ చరాలు నివసిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇందులో కొన్ని మనుషులతో పాటు సాదు జంతువులు లాగా నివసిస్తుంటే.

 The Viral Video A Woman Shows Courage In Catching The King Cobra-TeluguStop.com

మరికొన్ని అడవుల్లో వన్యమృగాలు జీవనం కొనసాగిస్తున్నాయి.వన్యమృగాలను చూస్తే జనాలు కచ్చితంగా భయపడుతూ ఉండడం మనం చూస్తాం.

ఇలాంటి వాటిల్లో సర్పాలు లాంటి వాటిని చూస్తే ఒంట్లో ఖచ్చితంగా వణుకు రావడం సహజం.అలాంటి సర్పాలు మన ఇళ్లలో అప్పుడప్పుడు దర్శనమిస్తూ వుండటం కూడా గమనిస్తూనే ఉంటాం.

 The Viral Video A Woman Shows Courage In Catching The King Cobra-వైరల్ వీడియో: ధైర్యం అనే పదానికి సాక్షిగా నిలుస్తున్న యువతి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ సమయంలో మనం వాటిని చూస్తే కచ్చితంగా గుండె ఆగినంత పని అవుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.అయితే మరికొంతమంది పాములను పట్టుకొని వాటిని అడవుల్లో వదిలిపెట్టడం లాంటివి కూడా గమనిస్తూనే ఉంటాం.

ఇక అసలు విషయంలోకి వెళితే.

తాజాగా ఓ యువతి తన ఒంటి చేత్తో భారీ సైజు కింగ్ కోబ్రా ను పట్టుకొని బంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

నిజానికి ఆ పామును డైరెక్టుగా చూస్తే మన గుండె ఆగిపోవడం ఖచ్చితం.అలాంటి భారీ సైజు ఉన్న కింగ్ కోబ్రాను ఆ యువతి ఎంతో నేర్పుతో చాకచక్యంగా పట్టుకునే విధానాన్ని వైరల్ వీడియోలో గమనించవచ్చు.

ముందుగా ఆ విష సర్పాన్ని పట్టుకునేందుకు ఆ యువతి ఓ కర్ర సహాయంతో పట్టుకోవడానికి ప్రయత్నించగా ఆ కింగ్ కోబ్రా బుసలు కొడుతూ కాటు వేయడానికి ప్రయత్నం చేసింది.ఆయన కానీ ఆ అమ్మాయి ఎంతో నేర్పుతో ఆ సర్పాన్ని ఎలాంటి సహాయం లేకుండా కేవలం చేతులతోనే పట్టుకొని గదిలోనుంచి బయటకు తీసుకు వెళ్ళింది.

అలా బయటకి తీసుకువచ్చిన పామును దాని తల పట్టుకునేందుకు ఎంత ప్రయత్నించినా కానీ.ఆ కింగ్ కోబ్రా యువతిపై తెగ బుసలు కొట్టింది.ఆయన కానీ ఆ అమ్మాయి మాత్రం ఎలాంటి భయం లేకుండా., ఆ కింగ్ కోబ్రాను పట్టుకొని గోనెసంచులలో పెట్టేసింది.ఈ మొత్తం తతంగం సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన నెటిజెన్స్, కామెంట్స్ లైక్ లతో హోరెత్తిస్తున్నారు.

ఇక కామెంట్స్ లో నెటిజన్స్ ఇలాంటి విష సర్పం ను చూస్తేనే గుండె ఆగిపోతుంది.అలాంటిది ఆ అమ్మాయి గుండె ధైర్యానికి జోహార్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

#Vira Vidoe #Woman #Poisonous Snake #Media #Bite

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు