వైరల్ వీడియో: గాల్లో ఎగురుతున్న డేగ పై దాడి చేసిన చేప..!

గాల్లో ఎగురుతున్న పక్షిని సముద్రంలో ఉండే చేప అందుకోవడం ఎపుడైనా చూశారా.అసలు అది ఎలా సాధ్యం అని అనుకుంటారు కదా.

 Viral Video A Fish Attacked The Flying Eagle , Viral Video, Social Media, Viral-TeluguStop.com

కానీ నిజంగానే గాలిలో ఎగురుతున్న ఓ గద్దపై సముద్రంలో ఉన్న చేప దాడి చేసింది.ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గద్దల్లో సుమారు 60 జాతులున్నాయి.ఈ జాతి పక్షులు అనేకం వివిధమైన పేర్లతో పిలవబడుతున్నాయి.ఇవి ఎక్కువగా యూరేసియా, ఆఫ్రికా ఖండాలలో కనిపిస్తాయి.బాల్డ్ గద్దలు, గోల్డెన్ గద్దలు అనే రెండు జాతులు మాత్రమే అమెరికా, కెనడా లలో, 9 జాతులు అమెరికా, దక్షిణ అమెరికా లలోను, మరో 3 జాతులు ఆస్ట్రేలియాలో కనిపిస్తాయి.

గద్ద రెక్కలు పొడుగ్గా ఉంటాయి.వాటి కాళ్లల్లో శక్తి తక్కువగా ఉంటుంది.

గద్దలు గాలిలో ఎగురుతూ పల్టీలు కొడతాయి.ఎక్కువ కాలం గాలిలో తేలియాడుతూ ఉంటుంది.

చిన్నచిన్న పురుగులని, చచ్చిన జంతువులని కూడా తింటాయి.సాధారణంగా చేపలు మంచి నీటిలో, ఉప్పు నీటిలో జీవిస్తుంటాయి.

చేపల్లో సుమారు 25,000 జాతులు ఉన్నాయి.చేపలను వాటి శ్వాసవయవాల అమరికను బట్టి ఊపిరితిత్తుల చేపలు, మొప్పల చేపలు అని రెండు రకాలుగా విభజించారు.

చేపలను నివసించే చోటును బట్టి మంచి నీటి చేపలు, ఉప్పునీటి చేపలు అని చెప్పవచ్చు.చేపల్లో అతి చిన్నది 0.25 సెంటి.మీ పొడవు ఉంటుంది.

అదే పెద్ద చేప అయితే 2మీ.కంటే ఎక్కువ పొడవుగా ఉంటాయి.

సాధారణంగా సముద్రాల్లో ఉండే చేపలు చాలా పెద్దవిగా ఉంటాయి.అప్పుడప్పుడూ గాల్లోకి ఎగురుతూ ఉంటాయి.ఈ వీడియోలో అలా ఓ పెద్ద చేప పైకి ఎగిరి. సముద్రం నీటికి కాస్త దగ్గరగా ఎగురుతున్న పక్షిపై దాడి చేసింది.

సాధారణంగా గద్దలు గాలిలో రౌండ్లు కొడుతూ కింద ఏదైనా కనిపిస్తే దాన్ని ఎత్తుకొని పోతాయి.కానీ ఇక్కడ రివర్స్ లో జరిగింది.

కింద ఉన్న చేపనే పైన ఉన్న పక్షిని నోటితో బంధించింది.ఆ పక్షిని తన నోటితో పట్టుకుని సముద్రం లోతుల్లోకి తీసుకుపోయింది.

ఎంతో బలంగా ఉండే గద్దను ఇలా ఓ చేప ఎత్తుకుని పోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు కామెంట్లు చేస్తున్నారు.

ఆహారం కోసం వేటకు వచ్చి.నిశబ్ధంగా గాలిలో ఎగురుతున్న గద్ద.

తనపై జరగబోయే ఈ దాడిని ఊహించలేక పోయిందని కామెంట్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube