వైరల్ ఫోటో : స్నేహితుడి పెళ్లికి వెరైటీ గిఫ్ట్ .. 5లీటర్ల పెట్రోల్..

పెళ్ళికి వెళ్తే నూతన వధూవరులకు ఏదో గిఫ్ట్ తీసుకు వెళ్లటం సంప్రదాయం… చుట్టాలైతే డబ్బులు కవర్లో పెట్టి ఇస్తే, వాళ్ళు ఏదో ఒకటి కొనుక్కుంటారని డబ్బులు ఇవ్వడానికే ప్రాధాన్యత ఇస్తారు ఇస్తారు.స్నేహితులైతే డిన్నర్ సెట్ ఇద్దామా.

 The Viral Photo Of 5l Petrol Gift In The Marriage Groom-TeluguStop.com

వాల్ క్లాక్ ఇద్దామా అంటూ రకరకాల ఆలోచనలు చేస్తుంటారు.కానీ ఇక్కడ కొందరు స్నేహితులు ఓ కొత్త జంటకు ఏం బహుమతి ఇచ్చారో తెలిస్తే మీరు షాక్ అవుతారు.

ఐదు లీటర్ల పెట్రోల్ క్యాన్‌ను గిఫ్టుగా ఇచ్చారు.తమిళనాడులో చోటు చేసుకున్న ఈ ఘటన అందరిని ఆశ్చర్య చకితులను చేస్తుంది.

అంతేకాదు ప్రస్తుత పరిణామాలకు అద్దం పడుతుంది.

స్నేహితుడి పెళ్లి వుండటంతో అతనికి ఏం గిఫ్ట్ ఇద్దామని స్నేహితులందరూ అనుకున్నారు.వెంటనే వారికి వెరైటీగా పెట్రోల్ గిఫ్టుగా ఇద్దమనే ఆలోచన వచ్చింది.వెంటనే దాన్ని అమలు చేశారు.

క్యాన్‌లో 5 లీటర్ల పెట్రోల్ కొని నవదంపతులకు కానుకగా ఇచ్చారు…నూతన వధూవరులకు పెట్రోల్ క్యాన్ బహుమతిగా ఇస్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.తమిళనాడులో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.85.15 వుంది.అంటే వందకు చేరువలో వుంది.

ధర పెరిగిన పెట్రోల్‌ను వారికి బహుమతి ఇస్తే పెళ్లి పనుల్లో బైకుల అటూ ఇటు తిరగడానికి పనికొస్తుందని ఈ పని చేశామని చెప్తున్నారు సదరు స్నేహితులు.వారు అనుకున్నది బాగానే వున్నా… స్టేజీ మీద దంపుతులకు పెట్రోల్ క్యాన్ గిఫ్టుగా ఇవ్వడంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యంలో పడ్డారు…సోషల్ మీడియాలో వైరలవుతున్న ఈ ఫోటో చూసి ప్రస్తుతం అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న పెట్రోల్ రేట్లకు చెంపపెట్టు అని కొందరు నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube