వైరల్: తన పెంపుడు కుక్కల బొచ్చుతో స్కార్ఫ్ తయారు చేయించుకున్న యజమానురాలు..!

సాధారణంగా గొర్రెల నుంచి తీసిన ఉన్నితో బ్లాంకెట్స్, జర్కిన్లు, మఫ్లర్లు, స్కార్ఫ్లు తయారుచేస్తారు.కానీ ఓ మహిళ ఏకంగా తన పెంపుడు కుక్క బొచ్చు తోనే స్కార్ఫ్ ను తయారు చేయించింది.

 The Viral Pet Owner Who Made Scarf Out Of Her Pet Dogs Fur-TeluguStop.com

అలాగే తాను తయారు చేయించుకున్న స్కార్ఫ్ ను మెడలో వేసుకుని మురిసిపోయింది ఇంతకీ ఆమె ఎందుకు ఇలా చేసిందంటే తను పెంచుకుంటున్న పెంపుడు కుక్కలపై ఉన్న ప్రేమతోనే ఇలా చేసిందంట వివరాల్లోకెళ్తే.

మైకెళ్లే పార్కర్ అనే మహిళకు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం.

 The Viral Pet Owner Who Made Scarf Out Of Her Pet Dogs Fur-వైరల్: తన పెంపుడు కుక్కల బొచ్చుతో స్కార్ఫ్ తయారు చేయించుకున్న యజమానురాలు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో ఆమె రెండు బొచ్చు కుక్కల్ని తెచ్చుకొని పెంచుకుంటోంది.వాటిలో ఒక దాని పేరు లుకా, వయస్సు నాలుగేళ్లు, ఇంకో దాని పేరు కిషోన్డ్, వయస్సు పన్నెండేళ్లు.

తన రెండు బొచ్చు కుక్కలంటే ఆ మహిళకి ఎంతో ఇష్టం వాటికి కూడా తమ యజమానురాలంటే ఎంతో ఇష్టం.ఎప్పుడు తమ యజమాని రాళ్లు వెంటే తిరుగుతూ ఉండేవి.

అయితే ఆ మహిళకు ఒక ఆలోచన వచ్చింది.మనుషులు జీవించి ఉన్నంత కాలం జంతువులు ఉండవు కాబట్టి ఏదో ఒక రోజు తన పెంపుడు కుక్కలు తనను వదిలి వెళ్లి పోతాయని.

వాటికి గుర్తుగా ఏమైనా చేయాలని అనుకుంది.ఈక్రమంలో ఒక సారి ఆమె ఫేస్ బుక్ చూస్తూ ఉండగా తనకు ఒక పోస్ట్ కనిపించింది.

అందులో ఓ వ్యక్తి కుక్క బొచ్చుతో తయారు చేసిన స్కార్ఫ్ ను వేసుకున్న ఫోటోను చూసింది.దీంతో ఆ ఫోటో చూడగానే ఆ మహిళకు ఒక ఆలోచన తట్టింది.

అనుకున్నదే తడవు గా తన రెండు పెంపుడు కుక్కల బొచ్చుతో తాను కూడా స్కార్ఫ్ చేయించుకోవాలని అనుకుంది.దీని కోసం ఆమె రూ.18 వేలను ఖర్చుపెట్టి పెంపుడు జంతువుల బొచ్చుతో స్కార్ఫ్ తయారు చేసే వాళ్ళని వెతికి పట్టుకుంది.లుకా నుంచి 425 గ్రాములు, కిషోన్డ్ నుంచి 98 గ్రాముల బొచ్చును తీయించింది.

Telugu 18 Thousand Rupees, Dogs Fur, Kishond Pet Dog, Made, Made Scarf, Michalle Parker, Pet Dogs Fur, Social Media, Viral, Viral Latest, Viral News, Viral Pet Owner, Women Scraf-Latest News - Telugu

తన పెంపుడు కుక్కలతో తనకు ఉన్న అనుబంధంగాతో ఖర్చు ఎక్కువైన పర్వాలేదు అనుకుని డబ్బుకు వెనకాడకుండా స్కార్ఫ్ తయారు చేయించుకుంది.దీంతో తాను మాట్లాడుతూ తనకు కుక్కలంటే చాలా ఇష్టమని, తనతో పాటు అవి ఎప్పటికీ ఉండవని, ఏదో ఒక రోజు తనని విడిచి వెళ్లిపోతాయని అప్పుడు తన పెంపుడు బొచుకుక్కల బొచ్చు తో తయారు చేసుకున్న స్కార్ఫ్ తనకి జ్ఞాపకం గా ఉంటుందని తెలిపింది.అందుకే ఆ స్కార్ఫ్ని ఎంతో ఇష్టంగా చేయించుకున్నాని 2020 క్రిస్మస్ వేడుకలకు మాత్రమే వేసుకున్నానని తరువాత ఇంక దాన్ని భద్రంగా దాచుకుంటానని చెపుకొచ్చింది.దీనికి సంబంధించిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

#Kishond Pet Dog #Scarf #Dogs #Thousand Rupees #Pet Dogs

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు