పిల్లలను చంపి నెలల పాటు కారు డిక్కీలో పెట్టుకున్న కిరాతకురాలు.. ఎక్కడంటే?

ప్రస్తుతం మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా క్రైమ్స్ పెరుగుతున్నాయని, క్రైమ్ రేటు పెరిగిపోతున్నదని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.కాగా, ఇలా హత్యలు పెరిగిపోవడానికి ప్రధాన కారణం అత్యాశ, మనీయేనని అంచనా వేస్తున్నారు నిపుణులు.

 The Villain Who Killed Children And Put Them In A Car Collision For Months Where-TeluguStop.com

ముఖ్యంగా డబ్బు కోసం సొంత తల్లిదండ్రులు, సోదరులను చంపేందుకు వెనకాడని ఘటనలను మనం బోలెడు చూడొచ్చు.మనం తెలుసుకోబోయే ఈ ఘటనలో ఓ మహిళ పిల్లలను అత్యంత కిరాతకంగా చంపేసింది.

ఆమె ఎందుకు వారిని చంపింది? వారు ఆమె కన్నబిడ్డలేనా? అసలు వారెవరు? తదితర వివరాలు తెలియాలంటే మీరు ఈ స్టోరీని ఫుల్లీ రీడ్ చేయాల్సిందే.

 The Villain Who Killed Children And Put Them In A Car Collision For Months Where-పిల్లలను చంపి నెలల పాటు కారు డిక్కీలో పెట్టుకున్న కిరాతకురాలు.. ఎక్కడంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అగ్రరాజ్యం అమెరికాలోని బాల్టిమోర్‌కు సమీపంలోని ఈస్ట్ కోస్ట్ సిటీలో జరిగిన ఈ దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల వివరాల ప్రకారం.ఈ‌స్ట్ కోస్ట్ సిటీకి చెందిన నికోల్ జాన్సన్ అనే మహిళ ఇటీవల కాలంలో ఓ పని నిమిత్తం కారులో ప్రయాణం చేస్తుంది.

ఈ క్రమంలో పోలీసులు ఆమెను ఆపి డ్రైవింగ్ లైసెన్సు, కారుకు సంబంధించిన వివరాలు అడిగారు.అయితే, పోలీసుల క్వశ్చన్స్‌కు ఆమె సమాధానాలివ్వకుండా వింతగా ప్రవర్తించింది.

పైగా మీరు నన్ను ఏం చేయలేరు.ఇంకో ఫైవ్ డేస్‌లో నేను సంచలనంగా మారిపోతానని నికోల్ జాన్సన్ పోలీసులకు చెప్పింది.

దాంతో ఆమెపై అనుమానమొచ్చి పోలీసులు కారును తనిఖీ చేశారు.కారులో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఇద్దరు చిన్నారుల మృతదేహాలను చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు.

వెంటనే డెడ్ బాడీస్‌ను బయటకు తీసి పోస్ట్‌మార్టం కోసం పరిశీలనకు పంపారు.సదరు మహిళను అరెస్ట్‌ చేసి విచారణ ప్రారంభించారు.పిల్లలను ఎందుకు చంపాల్సి వచ్చింది? అని ప్రశ్నించగా ఆమె నుంచి సమాధానం రానట్లు తెలుస్తోంది.అయితే, పిల్లలు బంధువులేనని ఆమె ఒప్పుకుంది.

ఐదేళ్ల మేనల్లుడు, ఏడేళ్ల మేనకోడలు ఇద్దరు అక్కవద్ద నుంచి తన వద్దకు వచ్చినట్లు పేర్కొంటోంది.కాగా, పిల్లలను అత్యంత కిరాతకంగా చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

డెడ్ బాడీస్‌ను నెలల పాటు కారు డిక్కీలో పెట్టుకుని ఆమె ప్రయాణించడాన్ని బట్టి పోలీసులు ఇన్ని రోజులు ఎందుకు కారును పరిశీలించలేకపోయారనే ప్రశ్న ఎదురవుతోంది.అయితే, ఎందుకు వారిని హతమార్చిందనేది ఇంకా తెలియరాలేదు.

#Smart Phone #America #Children #Killed Children

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు