గాడిద‌పై ఊరేగిన ఆ ఊరి స‌ర్పంచ్‌.. కార‌ణం తెలిస్తే షాక్‌..!

వర్షాన్ని కోరే సంస్కృతి మనది.కాగా, మనం ఎందుకు వానలు కోరుకుంటామో అందరికీ విదితమే.

 The Village Serpent Who Marched On The Donkey Shock If You Know The Reason-TeluguStop.com

భారత్ ప్రధానంగా వ్యవసాయాధారిత దేశం కాబట్టి పంటలు పండాలంటే వానలు కావాలి.ఈ క్రమంలోనే రకరకాల ఆచారాలు అమలులో ఉన్నాయి.

వానలు పడాలని కోరుతూ రకరకాల పండుగలు జరుపుకుంటారు.తెలుగు రాష్ట్రాల్లో కప్పతల్లి ఆటలు ఆడటం, వానమ్మ ఒకసారి రావమ్మా అని పాటలు పాడటం గురించి మనందరికీ తెలుసు.

 The Village Serpent Who Marched On The Donkey Shock If You Know The Reason-గాడిద‌పై ఊరేగిన ఆ ఊరి స‌ర్పంచ్‌.. కార‌ణం తెలిస్తే షాక్‌..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా, ఆ గ్రామంలో గ్రామ పెద్దగా సర్పంచ్ ఓ వింత ఆచారాన్ని పాటించాడు.ఆ ఆచారమెంటీ? ఆయన ఎందుకు అలా చేశాడు?.

మన దేశంలో ప్రతీ వంద కిలోమీటర్లకు ఆచార వ్యవహారాలు, వేషధారణ మారుతుంటాయి.అదే భిన్నత్వం కాగా, అందరూ కలిసి మెలసి ఉండటం ఏకత్వమని పెద్దలు చెప్తుంటారు.అయితే, వరుణుడు కరుణించాలని కోరే విషయంలోనూ వివిధ ప్రాంతాల ప్రజలు వివిధ రకాలుగా కోరుతుంటారు.ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలోని రంగై గ్రామ సర్పంచ్ వానలు పడాలని కోరుతూ గాడిదపై ఊరేగాడు.

అలా చేయడం వల్ల విస్తారంగా వర్షాలు పడతాయని, సుఖ సంతోషాలతో ప్రజలు ఉంటారని వారి నమ్మకం.ఈ వింత ఆచారాన్ని ప్రజలు క్రమం తప్పకుండా పాటిస్తుండటం విశేషం.

అయితే, ఇక్కడ ప్రజలు పాటించడం వరకు ఓకే.కానీ, గ్రామ ప్రజాప్రతినిధి గాడిదపై ఊరేగడమే ప్రత్యేకం.

Telugu Donkey, Rangai Village Sarpanch, Sarpanch, Sushil Verma, The Village Serpent Who Marched On The Donkey Shock If You Know The Reason-Latest News - Telugu

గ్రామ పెద్దగా తాను గాడిదపై ఊరేగానని, అది కర్తవ్యంగా భావించానని సర్పంచ్ సుశీల్ వర్మ పేర్కొంటున్నాడు.ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల రైతులు తమ ఏరియాలో వానలు లేకపోవడంతో బాధపడుతున్నారు.కాగా, రంగై గ్రామ సర్పంచ్ గాడిదపై ఊరేగుతూ గ్రామం అంతా తిరిగారు.ఈ యాత్రలో గాడిదపై ఉన్న సర్పంచ్‌కు గ్రామ ప్రజలు అభివాదం చేశారు.గ్రామంలోని ప్రజలు,పెద్దలు, పిల్లలు అందరూ యాత్రలో పాల్గొన్నారు.డప్పు చప్పుళ్లు, విజిల్స్, డిఫరెంట్ డ్యాన్స్‌ల మధ్య సర్పంచ్ ఎంజాయ్ చేస్తూ గాడిదపై గ్రామాన్ని చుట్టాడు.

సర్పంచ్ ఈ విధంగా పర్యటించడం వీడియోలో రికార్డు చేసి దానిని సోషల్ మీడియాలో విడుదల చేశారు ఒకరు.అది కాస్తా నెట్టింట వైరలవుతోంది.

అయితే, పలువురు ఈ వీడియో చూసి నెగెటివ్ కామెంట్స్ చేస్తుండగా, అలా చేయొద్దని మరి కొందరు కోరుతున్నారు.ఓ ప్రాంత ఆచారాలు మరో ప్రాంతవాసులకు ఫన్నీగా ఉంటాయని తెలుపుతున్నారు.

#Donkey #RangaiVillage #Sushil Verma #Sarpanch #TheVillage

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు