ఆ ఊరు భౌతికంగా లేదు.. కానీ పంచాయ‌తీ ప‌రిపాల‌న ఉంద‌ట‌..

మాన‌వులు పూర్వపు కాలం ఒక్కోచోట గుంపులుగా ఏర్ప‌రుచుకున్న నివాసాల‌నే మ‌నం గ్రామాలుగా పిలుస్తున్నాం.ఇప్ప‌టికే ఎన్నో గ్రామాలు పెద్ద‌వై ప‌ట్ట‌ణాలుగా ఏర్ప‌డితే కొన్ని మాత్రం క‌నుమ‌రుగై పోయాయి.

 The Village Is Not Physical .. But It Is Under The Administration Of The Panchay-TeluguStop.com

ఇలా క‌నుమ‌రుగై పోవ‌డానికి ఎన్నో కార‌ణాలు కూడా ఉండొచ్చు.ఇందులో ప్ర‌ధానంగా పెద్ద పెద్ద రోగాలు గ్రామాల‌ను మాయం చేసేశాయి.

వ్యాధుల బారిన ప‌డ్డ‌ప్పుడు వ‌ద‌ల సంఖ్య‌ల్లో జ‌నాలు చ‌నిపోవ‌డంతో మిగ‌తా వారంతా ఊర్ల‌ను విడిచి వెళ్లిన ఘ‌ట‌న‌లు కూడా అనేకం ఉన్నాయి.ఇక ఇప్పుడు ఓ విచిత్ర ఊరు గురించి చెప్పుకోబుతున్నాం.

ఈ ఊరు వందేళ్ల కిందట వేటపాలెం మండలానికి చెందిన‌దిగా ఉండేది.దీని పేరు పుల్లరిపాలెం.ఈ గ్రామంలో ఒక‌ప్పుడు ఊరినిండా జ‌నాలు నివ‌సించేవారు.కానీ కాల క్ర‌మేనా ప్లేగుతో పాటుగా కలరా లాంటి పెద్ద రోగాలు రావ‌డంతో ఊర్లో చాలా వ‌ర‌కు జ‌నాలు మృత్యువాత పడ్డారు.

ఇక మిగిలిన వారంతా అది చూసి భ‌య బ్రాంతుల‌కు గుర‌యి ఊర్ల‌ను వ‌దిలి వెళ్లిపోయారు.అదే స‌మ‌యంలో ఈ ఊరి వారు కూడా వ‌ల‌స వెళ్లిపోయారంట‌.

ఇలా ఒక్కొక్క‌రుగా ఒక్కో కార‌ణంతో ఊరిని విడిచి పెట్ట‌డంతో ఊరు మొత్తం ఖాళీ అయిపోయిన‌ట్టు చెబుతున్నారు.

Telugu Anadr Pradesh, Pathareddipalem, Prakasam, Pullai Pallem-Latest News - Tel

అయితే ఈ గ్రామంలో ప్ర‌స్తుతం మ‌నిష‌న్న వాడు లేక‌పోయినా కూడా పంచాయతీకి సంబంధించిన వ్య‌వ‌హారాలు మాత్రం జ‌రుగుతున్నాయి.ఈ పుల్ల‌రిపాలెం ఊరుకు దగ్గరలోని ఉండే కొత్తరెడ్డిపాలెం పంచాయ‌తీగా కొనాసాగుతోంది.కాగా ఈ ఊరు భౌతికంగా లేక‌పోయినా కూడా దీని పేరుమీద వ‌చ్చే ఫ‌లితం మొత్తం కొత్తరెడ్డిపాలెంతో పాటు పాతరెడ్డిపాలెం అలాగే రామాచంద్రాపురం లాంటి కొన్ని ఊర్లు దీని ఫ‌లాలు అందుకుంటున్నాయి.

ఇంకా విచిత్రం ఏంటంటే ఈ ఊరుకు ఓ సర్పంచ్ తో పాటు కార్యదర్శి అలాగే వీఆర్ఓ లు కూడా ఉన్నారండి.అయితే లామినెటెబ్ గ్రామాలు మాత్రం ఈ ఊరు ఫ‌లాలు పొందుతున్నాయి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube