5వేల అడుగుల ఎత్తులో ఉన్న గ్రామం.. ఈ గ్రామ విశేషాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

సముద్రమట్టానికి వేల అడుగుల ఎత్తులో ఉన్న ప్రదేశాల సంఖ్య చాలా తక్కువనే చెప్పుకోవచ్చు.ఎత్తయిన ప్రాంతం అనగానే మనకు పెరూ దేశమే గుర్తొస్తుంది.

 The Village Is Located At An Altitude Of 5 Thousand Feet .. You Will Be Amazed T-TeluguStop.com

దక్షిణ అమెరికాలోని పెరూ దేశంలో మాచు పిచ్చు దాదాపు రెండున్నర వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది.ఇంత ఎత్తైన ప్రదేశంలో రజనీకాంత్, ఐశ్వర్యారాయ్ కిలిమంజారో పాటకు డాన్స్ చేసిన సంగతి విధితమే.

అయితే ఇలాంటి ఎత్తైన ప్రదేశాలు ప్రపంచవ్యాప్తంగా మరికొన్ని ఉన్నాయి.ఇప్పుడు వాటిలో ఒకటైన షోంకే అనే గ్రామం గురించి తెలుసుకుందాం.

కాఫీ పానీయం పుట్టిన ఇథియోపియాలోనే షోంకే అనే ప్రత్యేకమైన గ్రామం ఉంటుంది.9 శతాబ్దాల కాలం నాటి ఈ గ్రామం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.సముద్ర మట్టానికి ఇది 1,600 మీటర్లు అంటే దాదాపు 5,200 అడుగుల ఎత్తులో ఉంటుంది.మన గ్రామాల వలె ఆ గ్రామంలో కూడా సందులు, రహదారులు, అడ్డదారులు ఇలా అన్ని రకాల దారులు ఉంటాయి.

కానీ ఈ గ్రామం లోకి ప్రవేశించాలంటే కేవలం రెండు ద్వారాల ద్వారా మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది.

Telugu Ways Entrance, Feets, Latest-Latest News - Telugu

ఈ గ్రామంలో 20 తరాలపాటు ప్రజలు నివసించారని చెబుతుంటారు.ఆ పూర్వీకులకు సంబంధించిన వివరాలు, లెక్కలతో కూడిన ఆధారాలు కూడా ఉన్నాయని చరిత్ర చెబుతోంది.అయితే అంత ఎత్తైన ప్రదేశంలో వ్యవసాయం చేయడం కష్టంగా మారడంతో షోంకే ప్రజలు చాలా వరకు అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలుస్తోంది.

వ్యవసాయంపై ఆధార పడే ఈ ప్రజలు ప్రస్తుతం కొండ ప్రాంతాలను ఆనుకుని ఉన్న ఎత్తైన ప్రదేశాల్లోకి తరలి పోయారని సమాచారం.గతంలో ఇక్కడ ఐదు వందల కుటుంబాలు నివసించేవారని కానీ ఇప్పుడు ఆ సంఖ్య 250కి తగ్గిపోయిందని నివేదికలు తెలియజేస్తున్నాయి.

షోంకే ప్రజలను ‘అర్గోబా’ అని పిలుస్తారు.‘అరబ్బులు లోపలకి వచ్చారు’ అని దీని అర్థం.

విశేషమేంటంటే ఇక్కడి ప్రజలు ఇప్పటికీ ప్రాచీన సంప్రదాయాలను పాటిస్తూ.తమ పురాతన సంస్కృతిని సంరక్షించుకుంటున్నారు.

Telugu Ways Entrance, Feets, Latest-Latest News - Telugu

షోంకే గ్రామంలో ఒక అత్యంత పురాతనమైన మసీదు కూడా ఉంది.ఇక్కడ తొమ్మిది వందల ఏళ్ల నుంచి ప్రాచీన పద్ధతులలో ఇస్లాంని బోధిస్తున్నారు.వందల ఏళ్ళ కిందట మహ్మద్‌ ప్రవక్త ఇస్లాం మతాన్ని ప్రారంభించారు.ఆ సమయంలో చాలా ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి.ఆ క్రమంలో అప్పటి పాలకులు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కొందరిని ఇథియోపియాలోని షోంకే గ్రామానికి తరలించారు.అంతేకాదు ఆ గ్రామంలో కి ఇతరులు ప్రవేశించకుండా ఉండేందుకు కేవలం రోడ్డు మార్గాలు మాత్రమే ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం ఇప్పుడా 2 ద్వారాల ద్వారా ప్రజల రాకపోకలు సాగిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube