భార్య లంచం బాగోతాన్ని బయటపెట్టిన భర్త.. వీడియో వైరల్

ప్రస్తుత రోజులలో ఎక్కడ చూసినా కూడా అనేక మంది ఆఫీసర్లు లంచం తీసుకుంటూ ఏసీబీ రైడ్స్( ACB Rides ) లో చిక్కుకోవడం అందరికీ తెలిసిన విషయమే.

అయితే కొంత మందికి సంబంధించిన విషయాలు బయటకి వస్తూ ఉంటే.

మరికొందరివి అలానే లో లోపల జరుగుతూ వారి సిరిసంపదలను పెంచుకుంటూ ఉన్నారు.తాజాగా తన భార్య అవినీతిని ఒక భర్త చాకచక్యంగా వ్యవహరించి విషయాన్ని ప్రపంచానికి తెలియచేశాడు.

తన భార్య అవినీతికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు.

వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా.హైదరాబాదులోని మణికొండ మున్సిపాలిటీలో దివ్య( Divya in Manikonda Municipality ) అనే యువతీ డీఈఈగా పని చేస్తున్నారు.ఆమె భారీగా లంచాలు తీసుకుంటూ అవినీతికి పాల్పడుతుందని భర్త శ్రీపాద్ తెలియజేశాడు.

Advertisement

అంతేకాకుండా భార్య అవినీతిని ఆధారాలతో సహా అందరికీ తెలియజేసేలాగా దివ్య పలు కాంట్రాక్టుల్లు ఓకే చెప్పేందుకు కాంట్రాక్టర్ల నుంచి లంచం తీసుకుంటున్నట్లు తెలియజేశాడు.అయితే ఈ అవినీతి సొమ్మును మొత్తం భార్య ఇంట్లో లేని సమయంలో వీడియో తీసి, ఇంట్లో ఎక్కడెక్కడ డబ్బు, బంగారం ఉందో అన్ని వీడియోలో బంధించాడు.

ఇక ఆ వీడియోలో నోట్ల కట్టలు భారీగా కనిపించాయి.అలాగే తన భార్య తన తమ్ముడికి ఇప్పటికే కోటి రూపాయల వరకు లంచం డబ్బులు అప్పుగా ఇచ్చిందని శ్రీపాద్ ( Sripad )తెలిపాడు.

ఈ క్రమంలో తన భార్యను పద్ధతి మార్చుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా కానీ వినిపించుకోలేదని శ్రీపాద్ తెలియజేశాడు.

ఇలా పలుసార్లు చెప్పినా కూడా నా మాట వినకపోవడం పక్కకు పెట్టి ఇంకా అవినీతి పెరిగిపోవడంతో వీడియోను విడుదల చేసినట్లు పేర్కొంటున్నాడు శ్రీపాద్ .ఇక ఈ వీడియో పై ఉన్నతాధికారులు స్పందించి ఆమె ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేయాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఇక మరికొందరు అయితే శ్రీపాద్ చేసిన తీరుకి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

వైరల్ వీడియో : భూమి నుండి10 అడుగుల ఎత్తులోకి ఎగిసిపడుతున్న నీరు
Advertisement

తాజా వార్తలు