వాడేసిన టిష్యూ పేపర్‌ ఒక్కటి 5 వేల రూపాయలు... జర్వం కోరుకునే వారు వాటిని కొనుగోలు చేస్తున్నారు

హోటల్స్‌ మరియు మరే ఇతర ప్రదేశాల్లో అయినా టిష్యూ పేపర్స్‌ను చేతులు తూడ్చుకునేందుకు మనం వినియోగిస్తాం.అక్కడ పేపర్‌ కాస్త నలిగి ఉన్నా దాన్ని ఎవరో యూజ్‌ చేసి ఉంటారని దాన్ని పట్టుకునేందుకు కూడా ఆసక్తి చూపించం.

 The Used Tissue Paper Cost Is 5000 Rupees-TeluguStop.com

టిష్యూ పేపర్స్‌ ఈమద్య ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తున్నాయి.చేతులు తూడ్చుకోవడంతో పాటు మొహం, ముక్కు ఇలా అన్ని రకాలుగా తూడ్చుకుంటూ ఉంటారు.

టిష్యూ పేపర్‌ బండిల్‌ 100 ఉండవచ్చు, కాస్త ఖరీదు అయితే 200 రూపాయలు కూడా ఉండవచ్చు.కాని ఒక్క టిష్యూ పేపర్‌, అది కూడా ఉపయోగించి వదిలేసిన టిష్యూ పేపర్‌ ను 5 వేల రూపాయలకు అమ్ముతున్నారు.

జ్వరం వచ్చిన వారు వాడి వదిలేసిన టిష్యూ పేపర్‌ ను వాడటం వల్ల జ్వరం వస్తుంది.ఆ విషయం నిరూపితం అయ్యింది.అందుకే ఎవరైనా జ్వరం రావాలని భావించేవారు, జలుబు కావాలని కోరుకునే వారు ఆ వాడేసిన టిష్యూ పేపర్లను తమ ముక్కు వద్ద ఉంచుకుంటారు.అలా వాటిల్లో ఉండే బ్యాక్టీరియాతో అనారోగ్యం బారిన పడతారు.

ఇదో వింత వ్యాపారంగా అమెరికాలో ప్రారంభం అయ్యింది.వాయెవ్‌ అనే సంస్థ ఈ పని చేస్తోంది.

ఎవరైతే అనారోగ్యం కావాలనుకుంటారో వారు ఈ సంస్థను సంప్రదిస్తే వారికి వాడేసిన టిష్యూను ఇస్తారు.ఆ టిష్యూతో అనారోగ్యం తెచ్చుకుంటారు.

ఇంతకు అనారోగ్యం కావాలని ఎందుకు అనుకుంటారు అనేగా మీ ఉద్దేశ్యం.అమెరికాలో లాంగ్‌ వీకెండ్‌ ప్లాన్‌ చేసుకున్న వారు, ఏదైనా టూర్‌కు వెళ్లేందుకు సిద్దమయిన వారు, ఆ టూర్‌ సమయంలో అనారోగ్య సమస్యలు తలెత్తవద్దని భావిస్తారు.

ముఖ్యంగా జలుబు వంటి ఇబ్బందికర సమస్య రావద్దని ఆ జలుబును ముందే తెచ్చుకుంటారు.

వైధ్య శాస్త్రవేత్తలు వెళ్లడించినదాన్ని బట్టి ఒకసారి జలుబు వస్తే మళ్లీ నెల రోజుల వరకు అది మీ ఒంటిని చేరదు.అందుకే టూర్‌కు ముందు జలువు, జ్వరం వంటికి తెచ్చుకుంటే ఆ తర్వాత టూర్‌ లో ఉన్నప్పుడు అవి రావు.అందుకే యూజ్‌ చేసిన టిష్యూ పేపర్‌ను వాడుతున్నారు.

ఈ వాడేసిన టిష్యూ పేపర్లను సంస్థ చాలా జాగ్రత్తగా సేకరిస్తుంది.అందుకోసం వారు కూడా పెద్ద మొత్తంలోనే ఖర్చు చేసుకుంటుంది.

ఎలాంటి ఆరోగ్య సమస్య లేని వారిని ఎంపిక చేసుకుని, వారికి జలువు, జ్వరం వచ్చేలా చేసి, వారితో ఆ టిష్యూలను వాడిపిస్తారు.ఆ టిష్యూలను కెమికల్స్‌ మద్యలో చాలా అందమైన బాక్స్‌లో ప్యాక్‌ చేస్తారు.

ఎవరైతే ఆర్డర్‌ ఇస్తారు వారికి వెంటనే డెలవరీ చేసేస్తారు.చాలా వింతగా ఉన్న ఈ వ్యాపారం అమెరికాలో బాగానే జరుగుతుంది.

ఇంకా ఎన్నెన్ని వింతలు మనం చూడాల్సి వస్తుందో కదా.!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube