కాంగ్రెస్ లో మొదలైన లుకలుకలు...అసలు కారణం ఇదే?- The Upheavals That Started In The Congress Is This The Real

The upheavals that started in the Congress Is this the real reason , congress party, uttam kumar reddy - Telugu #telanganacongress, Congress Leader N Uttam Kumar Reddy, Congress Party, Uttam Kumar Reddy

గ్రేటర్ ఎన్నికల్లో, దుబ్బాక ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.తరువాత పీసీసీ చీఫ్ నియామకం కోసం కాంగ్రెస్ హైకమాండ్ రకరకాల ప్రయత్నాలు చేసినా కొంత మంది నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇక పీసీసీ చీఫ్ ఎంపిక నిర్ణయాన్ని వాయిదా వేసింది.

 The Upheavals That Started In The Congress Is This The Real-TeluguStop.com

ఇక తరువాత కాంగ్రెస్ లో జరుగుతున్న గ్రూపులు, కుమ్ములాటలతో నే కాలం గడుపుతూ ప్రజల సమస్యల పోరాటం చేయకుండా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉనికి కోల్పోయే విధంగా తయారయింది.

అయితే ఏ నాయకుడు కూడా కాంగ్రెస్ లో ఉన్న నాయకుడికి, కార్యకర్తకు కూడా భవిష్యత్తు పట్ల భరోసా కల్పించే ప్రయత్నం చేయకపోవడంతో ఒక్కొక్కరుగా కాంగ్రెస్ ను వీడుతున్న పరిస్థితి ఉంది.

 The Upheavals That Started In The Congress Is This The Real-కాంగ్రెస్ లో మొదలైన లుకలుకలు…అసలు కారణం ఇదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సిర్పూర్ కాంగ్రెస్ ఇంచార్జి, యువ నాయకుడు పాల్వాయి హరీష్ బాబు బీజేపీ తీర్థం పుచ్చుకోనుండగా, కుత్భుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూనం శ్రీశైలంగౌడ్ బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న పరిస్థితి ఉంది.ఏది ఏమైనా కాంగ్రెస్ పట్ల ప్రజలే కాకుండా సొంత పార్టీ నాయకులకే భరోసా లేని పరిస్థితి నెలకొంటున్న ఈ పరిస్థితులపై సంరక్షణ చర్యలు చేపట్టకపోతే కాంగ్రెస్ కు మరింత నష్టం జరిగే అవకాశం ఉంది.

#CongressLeader #Congress Party

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు