ఈ తెలుగు పాట కుదించడానికి 5 రోజులు పట్టింది .కానీ తీసాక ఏం జరిగిందో తెలుసా.. ?

జ‌గ‌దేక‌వీరుని క‌థ. 1961లో వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో కనీవినీ ఎరుగని రీతిలో విజయం సాధించింది.

 Untold Story Of Shiva Shankari Song In Jagadeka Veeruni Katha Movie, Shiva Shank-TeluguStop.com

కెవి రెడ్డి దర్శకత్వంతో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రఖ్యాత నటుడు నందమూరి తారకక రామారావు హీరోగా నటించాడు.ఈ సినిమాలోని శివ‌శంక‌రీ శివానంద‌ల‌హ‌రి అనే పాట అప్పట్లో అద్భుతమైన పాపులారిటీ సాధించింది.

ఇప్పటీ సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకుంది.పలువురు గాయకులూ ఇప్పుడు సైతం ఆ పాటను గుర్తుకు చేసుకుంటారు.

పలు స్టేజి షోలలో ఆలపిస్తారు కూడా.మొత్తంగా తెలుగు సినిమా పరిశ్రమలో ఈ పాట ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

ఈ సినిమాలో ఈ పాటను పెట్టడాని ఓ కారణం ఉంది.దీని కంటే ముందే జ‌గ‌దేక‌వీరుని క‌థ‌ సినిమాలోని మిగ‌తా పాట‌ల రికార్డింగ్‌ అయిపోయింది.వాటి పిక్చ‌రైజేష‌న్ కూడా కంప్లీట్ చేశారు.క్లైమాక్స్ షూటింగ్‌కు మరో రెండు నెలల టైం మాత్రమే ఉంది.

ఈ సమయంలో డైరెక్ట‌ర్ కెవి రెడ్డి మ్యూజిక్ డైరెక్ట‌ర్ పెండ్యాల నాగేశ్వ‌ర‌రావుతో ఓ విషయాన్ని చెప్పాడు.ఈ పాట గురించి వివరించాడు.

ఈ పాట సినిమాకు గుండెలాంటిది అని వెల్లడించాడు.

Telugu Kv Reddy, Days, Jagadekaveeruni, Shiva Shankai, Shiva Shankari, Tollywood

అంతేకాదు.ఈ సినిమాకు మూల కారణం అయిన తమిళ మూవీ జ‌గ‌ద‌ల ప్‌ంతాప‌న్‌ ను ఓసారి పరిశీలించాలని చెప్పాడు.అయితే అసలు సినిమా చూస్తే.

దాని ప్రభావం ఈ సినిమా మీద పడుతుందని పెండ్యాల ఆ పని చేయలేదు.ఆ తర్వాత పాట రచయిత పింగళి నాగేంద్ర రారు ఈ పాట పల్లవి రాసి వినిపించాడు.

దర్శకుడు కెవి రెడ్డికి నచ్చింది.ఓకే చెప్పాడు.

Telugu Kv Reddy, Days, Jagadekaveeruni, Shiva Shankai, Shiva Shankari, Tollywood

ఈ పాట అంతటిని రాసి.15 రోజుల పాటు కష్టపడి బాణీలు కట్టాడు పెండ్యాల.పాట రెడీ అయినట్లు చెప్పాడు.ఓ రోజు అందరూ కూర్చుని పాట విన్నారు.అద్భుతంగా ఉందన్నారు.అయితే పాట లెన్త్ చాలా ఉన్నందున్న సగానికి తగ్గించాలని చెప్పాడు కెవి రెడ్డి.

నాలుగైదు రోజుల కష్టపడి కుదించాడు పెండ్యాల.ఈ పాటకు దర్శకుడు ఓకే చెప్పాడు.

ఈ పాట అద్భుతంగా తెరకెక్కించారు.తెలుగు సినిమా ప్రపంచంలో అద్భుత జనాదరణ పొందింది ఈ పాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube