ఓ ఉద్యోగి ఆశలు ఆవిరి చేసిన అకాల మృత్యువు.. !

ఈ జీవితం గాలిలో బుడగ వంటిది.రంగు రంగులుగా కనిపిస్తూ మురిపిస్తూనే అంతలో చిట్లిపోతుంది.

 The Untimely Death Of An Employee Whose Hopes Evaporated, Station Ghanpur, Railw-TeluguStop.com

అందుకే బ్రతికినంత కాలం మనం సంతోషంగా ఉంటూ, మన చుట్టూ ఆనందకర వాతావరణాన్ని ఏర్పరచి కల్మషం లేకుండా జీవించాలి.ఎందుకంటే మనిషి మరణిస్తే ఏ బంధాలు, వేల కోట్ల ఆస్తులు వెంటరావు.

ఈ నిజం తెలిసిన కూడా స్వార్ధంతో జీవించడం ఒక మనిషికే చెల్లింది.

ఇకపోతే స్టేషన్ ఘన్‌పూర్‌లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రియాజ్ అహ్మద్‌కు ఇటీవల ఏఎస్‌ఐగా ప్రమోషన్ వచ్చింది.

ఈ క్రమంలో ట్రైనింగ్ కూడా ముగిసింది.కాగా ప్రమోషన్ వచ్చిందని ఆనందిస్తూ, తన స్వస్థలమైన హన్మకొండకు హైదరాబాద్‌ నుంచి బయల్దేరాడు.

సరిగ్గా ఘన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధి లింగాల బైపాస్‌ రోడ్డు వద్దకు రాగానే మృత్యువు కబళించింది.ఇతను ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది.

తలకు తీవ్ర గాయం కావడంతో రియాజ్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.కాగా ఏఎస్‌ఐగా ప్రమోషన్ తీసుకుని ఏన్నో ఆశలతో ఉన్న ఈ ఉద్యోగి ఆశలు ఆవిరి చేస్తూ మృత్యువు అకస్మాత్తుగా కబళించడం నిజంగా విషాదకరం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube