సినిమా పరిశ్రమలో హీరోల కెరీర్ లు వైవిధ్యంగా ఉంటాయి అని చెప్పాలి ఇక్కడ ఎవరికైతే సక్సెస్ లభిస్తుందో వారు మాత్రమే ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతారు అని మనందరికీ తెలిసిన విషయమే.ముఖ్యంగా హీరోలు వాళ్ల మార్కెట్ ను పెంచుకోవాలి అంటే మాత్రం వరుసగా హిట్లు కొడుతూ ఉండాలి.
అలా ఇండస్ట్రీలో హిట్స్ సాధించిన వాళ్లకి ఎక్కువ క్రేజ్ ఉంటుంది.అప్పట్లో ఎన్టీఆర్, నాగేశ్వరరావు లాంటి హీరోలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకని స్టార్ హీరోలుగా ఎదిగిన విషయం మనకు తెలిసిందే.
వీళ్ళ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ , నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలు సైతం వరసగా హిట్లు కొడుతూ ఇండస్ట్రీలో అగ్రహీరోలు గా వెలుగొందారు.
అయితే వీరితో పాటుగా అదే సమయంలో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్ కూడా స్టార్ హీరో గా ఎదిగిన విషయం అందరికి తెలిసిందే.
అయితే రాజశేఖర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.రాజశేఖర్ వాళ్ళ నాన్న ఒక పోలీస్ ఆఫీసర్ రాజశేఖర్ వాళ్ళ ఫ్యామిలీ తెలుగు వాళ్లే అయినప్పటికీ వాళ్ళ నాన్న పోలీస్ ఆఫీసర్ అవ్వడం వల్ల ట్రాన్స్ఫర్ అవుతూ అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఉండేవారు.
అందుకే తన చదువు కూడా ఇక్కడ కొన్ని సంవత్సరాలు అక్కడ కొన్ని సంవత్సరాలు అన్నట్టుగా గడుస్తూ ఉండేది.రాజశేఖర్ మొదటగా ఎంబిబిఎస్ చేసి డాక్టర్ అయ్యాడు.చెన్నై లోని టీ నగర్ లో సపరేట్ గా ఒక క్లినిక్ కూడా పెట్టి దాంట్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉండేవాడు.ఆయన దగ్గరికి వైద్యం కోసం వచ్చిన చాలామంది మీరు చాలా అందంగా ఉన్నారు సినిమాలో ప్రయత్నించొచ్చు కదా అని ఆయనతో చెబుతూ ఉండేవారు.
అలా ఆయన తన లోపల సినిమా హీరో అవ్వాలని ఉన్న కోరికను ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు చెబుతూ ఉండటం వల్ల హీరో అవ్వాలి అని బలంగా నిశ్చయించుకున్నాడు.అలాగే ఎం ఎస్ కూడా చేయాలి అని అనుకున్నాడు సినిమా ఇండస్ట్రీలో చేయాలి అంటే ముందుగా ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకోవాలి అని తెలుసుకున్నాడు.దానికి సంబంధించిన ఇంటర్వ్యూలు జరుగుతుంటే దానికి అప్లై చేసాడు అలాగే ఎం ఎస్ చేయడానికి కూడా దానికి కూడా అప్లికేషన్ పెట్టాడు.ఆయన అదృష్టం ఏంటంటే రెండిట్లో సీట్ వచ్చింది కానీ ఎం ఎస్ తర్వాత చేయొచ్చు ప్రస్తుతానికి సినిమా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుదాం అని ఇన్స్టిట్యూట్లో లో చేరి శిక్షణ తీసుకున్నాడు అలా ఇన్స్టిట్యూట్ నుంచి శిక్షణ పొందిన రాజశేఖర్ సినిమా అవకాశాల కోసం తిరుగుతూ ఉండేవాడు .ఒక రోజు డైరెక్టర్ అయిన భారతిరాజా దగ్గరికి వెళ్లి ఒక మంచి వేషం ఇవ్వమని అడిగితే అతన్ని చూసిన భారతీరాజా మంచి సినిమా చేద్దాం అని ఆయనతో చెప్పాడు.
అదే ఇంతలోపు రాజశేఖర్ కి ఇంకొక అవకాశం రావడంతో దానికి భారతీరాజా గారి సినిమా స్టార్ట్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఆలోపు ఈ సినిమా చేద్దామని ఆ సినిమా చేశాడు.ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో మళ్లీ భారతీరాజా గారి దగ్గరికి వస్తే ఆయన నిన్ను మొదటగా ఇండస్ట్రీకి నేను పరిచయం చేయాలి అనుకున్న కానీ నువ్వు ఆల్రెడీ ఇండస్ట్రీకి పరిచయం అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం సినిమా చేయడం కుదరదు అని చెప్పి పంపించి వేశాడు.
అక్కడి నుంచి వెళ్లిపోయిన రాజశేఖర్ 15 రోజుల వరకు డిప్రెషన్ లో ఉన్నాడు మళ్లీ 20 రోజుల తర్వాత భారతీరాజా దగ్గర్నుంచి రాజశేఖర్ కి పిలుపు వచ్చింది.
అతను చేయబోయే సినిమాలో విలన్ క్యారెక్టర్ ఉంది చేస్తావా అని అడగడంతో చేస్తానని చెప్పి ఒప్పుకున్నాడు.అలా తమిళ సినిమాలో విలన్ గా కూడా నటించాడు ఆ సినిమా చూసిన దర్శకుడు టి కృష్ణ అరుణ కిరణం సినిమాలో అతనికి మంచి వేషం ఇచ్చాడు.
అక్కడి నుంచి తన ప్రస్థానం తెలుగులో అద్భుతంగా కొనసాగిందని చెప్పాలి కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అంకుశం సినిమా రాజశేఖర్ ని స్టార్ హీరోను చేసింది అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా వరుస హిట్లు కొడుతూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు .ఇదిలా ఉంటే తర్వాత కొన్ని సంవత్సరాలకి రాజశేఖర్ కి సరైన సక్సెస్ లేకపోవడంతో తనే ప్రొడ్యూసర్ గా మారి శేషు అనే సినిమా చేశాడు ఆ మూవీ ఫ్లాప్ అయ్యింది.దాంతో ఇంకో రెండు మూడు సినిమాలు కూడా ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు.అవి కూడా ఫ్లాప్ అవడంతో చేసేది ఏమీ లేక చెన్నైలో ఉన్న తన రెండు ఇళ్లను హైదరాబాదులో ఉన్న ఒక ఇల్లు ను అమ్మేసి అప్పులు కట్టుకున్నాడు.
తర్వాత డబ్బులు మళ్ళీ సమకూర్చుకొని ఎలా అయితే అలా అవుద్ది అని చెప్పి ఎవడైతే నాకేంటి సినిమా తీశాడు ఆ సినిమా మంచి విజయం సాధించడంతో రాజశేఖర్ మళ్ళీ ఫాంలోకి వచ్చాడు ఆ తర్వాత హిట్స్ కొడుతూ నెట్టుకొస్తున్నాడు పిఎస్వి గరుడ వేగా సినిమా మంచి విజయాన్ని అందుకున్న ఆ తర్వాత వచ్చిన కల్కి సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యింది అని చెప్పాలి.తన సినిమా కెరీర్ ప్రారంభించిన మొదట్లో తన పక్కన హీరోయిన్ గా చేసిన జీవిత తన జీవితంలోకి వచ్చిన తర్వాత తన జీవితం మారడం జరిగింది అప్పుడు వాళ్ళు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు ప్రస్తుతం దొరసాని సినిమాతో తన కూతుర్ ని హీరోయిన్ గా కూడా పరిచయం చేశారు రాజశేఖర్.