దేశంలో కరోనా వ్యాప్తికి కారణం అదే అంటున్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి..!!

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.కేవలం 48 గంటల్లో దేశంలో ఏడు లక్షల నుండి 8 లక్షల వరకు కొత్త కేసులు నమోదు కావడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టెన్షన్ పెట్టిస్తుంది.

 The Union Health Minister Sensational Comments On Spread Of Corona Harsha Vardha-TeluguStop.com

దీంతో ఇప్పటికే కరోనా నిబంధనలను అమలు చేసే విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలు ఇదే తరహాలో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం కూడా వేగవంతం చేస్తూ ఉంది.ఇదిలా ఉంటే దేశంలో ఈ రీతిగా వైరస్ విజృంభించడానికి గల కారణం గురించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దేశంలోకి బ్రిటన్ వేరియంట్లు ఎంట్రీ ఇవ్వడం జరిగింది అని, ఆ రకం వైరస్ వల్ల దేశంలో ఈ రీతిలో కొత్త కేసులు బయటపడుతున్నాయి అని స్పష్టం చేశారు.పంజాబ్ రాష్ట్రంలో దాదాపు 80 శాతం కేసుల్లో  బ్రిటన్ వేరియంట్లు ఉన్నట్టు పేర్కొన్నారు.

అంతేకాకుండా దేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరియు వివాహాలు అదేవిధంగా ఇతర వేడుకలు మరియు నిరసన కార్యక్రమాలు కారణంగా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నట్టు ఆరోగ్యశాఖామంత్రి పేర్కొన్నారు.  

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube