పంచామృతంలో వున్న ఔషధగుణాలు     2017-07-30   21:59:15  IST  Raghu V

హిందూ సంప్రదాయం ప్రకారం ఏ శుభకార్యం వచ్చిన ముందుగా పంచామృతాలను ఉపయోగిస్తారు. అంతేకాక గుడిలోకి వెళ్ళినప్పుడు కూడా మనకు పంచామృతాలను ఇవ్వటం తరచుగా చూస్తూ ఉంటాం. స్వచ్ఛమైన ఆవుపాలు, తీపిగా వున్న పెరుగు, స్వచ్ఛమైన నేయి, తేనె, పంచదార మిశ్రమంను పంచామృతం అని అంటారు. ఈ పంచామృతంలో ఉండే ఐదు పదార్ధాలలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

ఆవుపాలు


ఆవుపాలలో కాల్షియం సమృద్ధిగా ఉండుట వలన ఎముకల పెరుగుదలకు సహాయపడుతుంది. అంతేకాక ఆవుపాలలో ఉండే ‘‘విటమిన్ ఏ’’ కంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.

పెరుగు


పెరుగు జీర్ణ సంబంధ వ్యాధులను నయం చేయటంలో సహాయపడుతుంది. అలాగే జుట్టు సంరక్షణలో కూడా బాగా సహాయపడుతుంది.

నెయ్యి


నెయ్యి మేధస్సును పెంచటంలో సహాయపడుతుంది. నెయ్యిలో ‘‘విటమిన్ ఏ’’ ఉండుట వలన చర్మం కాంతివంతంగా మారటానికి సహాయాపడుతుంది. అయితే నెయ్యిని చాలా మితంగా తీసుకోవాలి.

తేనే


తేనే ఎటువంటి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. తేనే చర్మ సంరక్షణలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. తేనెలో ఖనిజాలు సమృద్ధిగా ఉండుట వలన జీర్ణ సమస్యలు రాకుండా కాపాడుతుంది.

పంచదార


పంచదార తక్షణ శక్తిని ఇస్తుంది. ఇన్ని మంచి గుణాలతో ఉన్న పంచామృతం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.